దేశంలో మత ప్రతిపాధికన నడిచే పార్టీల లిస్ట్ తీయాల్సివస్తే అందులో బీజేపీ( BJP ) మొదటి స్థానంలో ఉంటుంది.హిందుత్వ నినాదమే ఏజండాగా హిందు ఓటు బ్యాంకును ప్రధానంగా నమ్ముకున్న పార్టీగా చెప్పవచ్చు.
బీజేపీ నేతలు ఎక్కడ సభలు నిర్వహించిన, ఎక్కడ పర్యటనలు చేసిన హిందువాదాన్ని మాత్రమే మేజర్ హైలెట్ చేస్తుంటారు.దాంతో హిందువులు బీజేపీ పై ప్రత్యేక అభిమానం కనబరుస్తున్న.
ఇతర మతాల వాళ్ళు దురమౌతున్నారు.అయితే ప్రజాప్రతినిధులుగా అన్నీ మతాల వారిని సమానంగా చూడాల్సిన భాద్యత పోలిటికల్ లీడర్స్ పై ఉంటుంది.

కానీ బీజేపీ నేతలు మాత్రం హిందువులపై చూపే ప్రేమ.ఇతర మతల వారిపై చూపడం లేదనే విమర్శలు బీజేపీపై మొదటి నుంచి వినిపిస్తున్నాయి.దీంతో బీజేపీ అంటేనే పూర్తిగా మతపరమైన పార్టీ అనే అభిప్రాయం అందరిలోనూ నెలకొంది.కొన్ని సందర్భాల్లో హిందువులు కూడా ఆ పార్టీని నమ్మలేని పరిస్థితి.దీనికి బెస్ట్ ఉదాహరణే కర్నాటక ఎన్నికలు.లింగాయత్, ఒక్కలింగ( Lingayat, monogamous ) వంటి ఆగ్రాకులాల ఓటు బ్యాంకునే ప్రధానంగా నమ్ముకున్న బీజేపీకి.
వారే షాక్ ఇవ్వడంతో ఓటమి తప్పలేదు.అయినప్పటికి ఈ మతపరమైన రాజకీయాన్ని బీజేపీ వీడడం లేదు.
ఇక తెలంగాణలో కూడా మతపరమైన రాజకీయం చేస్తూనే ముందుకు సాగుతోంది బీజేపీ.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ఆద్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర నిర్వహిచింది బీజేపీ.ఈ యాత్రను బట్టి చూస్తే హిందూ ఓటు బ్యాంకు కోసమే బీజేపీ తాపత్రయం అనే సంగతి స్పష్టమౌతోంది.అయితే బీజేపీ ఉత్తరాదినా వర్కౌట్ అయిన హిందూ రాజకీయం తెలంగాణలో వర్కౌట్ అయ్యే ఛాన్స్ తక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు.
కాబట్టి బీజేపీ గెలవాలంటే హిందూ నినాదాన్ని మాత్రమే కాకుండా అన్నీ మతాల పట్ల సమాన వైఖరి ప్రదర్శించినప్పుడే ఆ పార్టీ కి మెరుగైన అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.అలా కానీ పక్షంలో కర్నాటక ఫలితాలే తెలంగాణలో కూడా రిపీట్ అవుతాయని విశ్లేషకులు చెబుతున్నా మాట.మరి బీజేపీ ఈ మతపరమైన రాజకీయాలను విడిచిపెడుతుందా లేదా అనేది చూడాలి.