అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు(Paderu )లో మావోయిస్ట్ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ సిలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.
ఈ క్రమంలోనే నక్సల్స్ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పేలుడు పదార్థాలు, ఎలక్ట్రిక్ పరికరాలతో పాటు విప్లవ సాహిత్యం లభ్యమైంది.
పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో నక్సల్స్ వీటిని అమర్చినట్లు తెలుస్తోంది.భారీ డంప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పాడేరులోని పలు ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నారు.