సినిమా రంగంలో గుర్తింపును సంపాదించుకోవాలంటే అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలతో పాటు గ్లామరస్ రోల్స్ కూడా చేయాలనే సంగతి తెలిసిందే.కొన్నేళ్ల క్రితం హీరోయిన్లు బికినీ వేసుకుంటే ఆ సినిమాలపై విడుదలకు ముందే క్రేజ్ ఏర్పడేది.
సీనియర్ హీరోయిన్ ప్రియమణి ద్రోణ సినిమాలో బికినీ వేసిన సంగతి తెలిసిందే.పెళ్లైన కొత్తలో సినిమాతో ప్రియమణి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
యమదొంగ సినిమాతో ప్రియమణికి స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చినప్పటికీ ఆ సినిమా తరువాత ప్రియమణి నటించిన సినిమాలేవీ ఆ సినిమా స్థాయిలో హిట్ కాలేదు.2009 సంవత్సరంలో విడుదలైన ద్రోణ సినిమాలో ఒక పాటలో ప్రియమణి బికినీలో కనిపించారు.ఆ పాట వల్ల సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్లు బాగానే వచ్చాయి.అయితే ఈ సినిమాలో బికినీ ధరించడానికి ప్రియమణి భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.

అయితే ద్రోణ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన డీఎస్ రావు తాజాగా స్పందించి మొదట సినిమా కథను ప్రియమణికి చెప్పిన సమయంలో బికినీ సాంగ్ లేదని అయితే దర్శకుడు కోరడంతో ప్రియమణి ఆ సాంగ్ చేయడానికి అంగీకరించారని డీఎస్ రావు అన్నారు.ఆ సాంగ్ కోసం ప్రియమణి ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందనే వార్తల్లో కూడా నిజం లేదని నిర్మాత డీఎస్ రావు చెప్పుకొచ్చారు.
అయితే ద్రోణ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో ప్రియమణి కెరీర్ కు ఈ సినిమా పెద్దగా ఉపయోగపడలేదు.ప్రస్తుతం ప్రియమణి సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.
ప్రియమణి వెంకటేష్ తో కలిసి నటిస్తున్న నారప్ప సినిమా త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత కూడా ప్రియమణి వరుస మూవీ ఆఫర్లతో బిజీ అవుతుండటం గమనార్హం.