దుంప జాతికి చెందని ముల్లంగిని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటుంటారు.ముల్లంగితో కర్రీ, ఫ్రై, చట్నీ ఇలా రకరకాల వాంటలు తయారు చేస్తుంటారు.
సాంబార్, సలాడ్స్ లో కూడా ముల్లంగిని విరి విరిగా ఉపయోగిస్తుంటారు.ఇక ముల్లంగి రుచిగా ఉండడంతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, బి6 , పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, జింక్, ఫైబర్ ఇలా ఆరోగ్యానికి ఉపయోగ పడే ఎన్నో పోషకాలు కలిగి ఉంటుంది.
అందుకే ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అయితే ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి ఎంత మంచి చేసినప్పటికీ.
ముల్లంగి విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకుంటే ఖచ్చితంగా రిస్క్‌లో పడతాం.ముఖ్యంగా ముల్లంగి తిన్న వెంటనే లేదా ముల్లంగితో కలిపి కొన్ని కొన్ని ఆహారాలను అస్సలు తినరాదు.
అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ముల్లంగి, పాలు.
ఈ రెండిటినీ కలిపి లేదా ఒకదాని తర్వాత మరొకటి అస్సలు తినరాదు.ఆ రెండు ఆహారాలను ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ముల్లంగి, కీరదోస.ఈ రెండిటినీ కూడా కలిపి తీసుకోరాదు.చాలా మంది సలాడ్స్‌లో ముల్లంగితో పాటు కీర దోసను కూడా వాడుతుంటారు.కానీ, ఇలా చేయడం వల్ల ఉదరం సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.కాబట్టి, ఈ రెండిటినీ ఒకేసారి తీసుకోకండి.
ముల్లంగితో కలిపి లేదా ముల్లంగి తీసుకున్న వెంటనే తీసుకోకూడని ఆహారాల్లో కాకరకాయ ఒకటి.ఈ రెండిటినీ ఒకే సారి తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి.అలాగే తలనొప్పి, ఛాతిలో మంట వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.
కాబట్టి, తీసుకోవాల్సి వస్తే ఈ రెండిటితో ఏదో ఒక దానినే తీసుకోవాలి.ఇక ముల్లంగి తీసుకున్న వెంటనే నిమ్మ జాతి పండ్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదు.