టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప నటులలో ఒకరైన చలపతిరావు మృతి ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.చలపతిరావు మృతిపై ఆయన కొడుకు రవిబాబు స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
సినిమా రంగానికి చెందిన వాళ్లలో చాలామంది నాన్నను బాబాయ్ అని ప్రేమగా పిలుస్తారని రవిబాబు తెలిపారు.ఎవరితో అయినా మాట్లాడే సమయంలో జోక్స్ వేస్తూ సరదాగా మాట్లాడటం నాన్నకు ఇష్టమని రవిబాబు వెల్లడించారు.
అందరితో సరదాగా ఉండే నాన్న ఎలాంటి నొప్పి, బాధ లేకుండా ప్రశాంతంగా చనిపోయారని రవిబాబు పేర్కొన్నారు.నిన్న రాత్రి భోజనం చేసేవరకు నాన్న ఆరోగ్యంగానే ఉన్నారని రవిబాబు కామెంట్లు చేశారు.
నాన్న నిన్న రాత్రి చికెన్ బిర్యానీ, చికెన్ కూర తిన్నారని ఆ తర్వాత ఆ ప్లేట్ ను ఇచ్చి వెనక్కి వాలిపోయారని రవిబాబు అన్నారు.మా అక్కలు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని ఆయన అన్నారు.
ఈరోజు అంత్యక్రియలు చేయాలని అనుకున్నామని మంగళవారం అంత్యక్రియలు చేయకూడదు కాబట్టి బుధవారం ఉదయం నాన్నగారి అంత్యక్రియలు జరుగుతాయని రవిబాబు పేర్కొన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ అంటే నాన్నగారికి ఎంతో అభిమానమని ఆయనతో కలిసి నటించినందుకు నాన్నగారు ఎంతో సంతోషంగా ఫీలయ్యేవారని ఆయన చెప్పుకొచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్ అంటే నాన్నగారికి ఎంతో అభిమానమని మంచి ఫుడ్ అన్నా జోక్స్ అన్నా నాన్నగారికి ఎంతో ఇష్టమని రవిబాబు కామెంట్లు చేశారు.కొన్నిరోజుల క్రితం నా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నాన్న నటించారని ఆ సినిమాలో కూర్చుని ఉండే పాత్రలో కనిపించారని రవిబాబు పేర్కొన్నారు.
రవిబాబు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.చలపతిరావు 1500కు పైగా సినిమాలలో నటించారని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత షాకవుతున్నారు.ఆయన తన సినీ కెరీర్ లో దాదాపుగా అన్ని పాత్రలలో నటించారనే చెప్పాలి.







