చేపలు, పీతలు, రొయ్యలు వంటి వాటిని చెరువుల్లో పెంచుతూ ఉంటారు.అలాగే సముద్రాలు, నదుల్లో కూడా ఇవి దొరుకుతాయి.
జాలర్లు వీటిని పట్టుకుని విక్రయించుకుంటూ జీవనోపాధి పొందుతారు.కానీ ఒక దేశం మాత్రం విచిత్రంగా పీతలను( Crabs ) నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
అంతేకాదు వీటిని నిర్మించడానికి రూ.కోట్లు ఖర్చు చేస్తోంది.దీని కోసం ఏకంగా ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.పీతలను నిర్మూలించడానికి బడ్జెట్ లో కేటాయింపులు చేయడమే కాస్త విచిత్రంగా ఉంది.
పీతల నిర్మూలన కోసం ఇటలీ ప్రభుత్వం( Government of Italy ) బడ్జెట్‌లో రూ.26 కోట్ల కేటాయింపులు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.పీతల్లో అనేక రకాల జాతులు ఉంటాయి.వీటిల్లో కొన్ని పీతలు నత్తల జాతిని అంతం చేస్తున్నాయి.దీని వల్ల నత్తలు పూర్తిగా మాయమవుతున్నాయి.పశ్చిమ అట్లాంటిక్ సముద్రంలో కనిపించే నీలి రంగు పీతల సంఖ్య ఇటలీలో పెరిగిపోతుంది.
వీటి వల్ల నత్తలు అదృశ్యమవుతున్నాయి.ఇటలీలో మొలస్కా జాతికి ( Mollusca )చెందిన నత్తలను ఎక్కువగా తింటూ ఉంటారు.
అయితే నీలి రంగు పీతలు వీటిని తినేస్తున్నాయి.మొక్కలతో పాటు ఇతర జలచర జంతువులను తినేస్తున్నాయి.
నీలి రంగు పీతల వల్ల ఇటలీలో ఆక్వా కల్చర్ పూర్తిగా దెబ్బతింటుంది.దీనిని విటిని నిర్మూలించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.దీని కోసం ప్రత్యేక నిధులను కేటాయించారు.దాదాపు రూ.26 కోట్లను నీలి రంగు పీతల నిర్మూలన కోసం బడ్జెట్ లో కేటాయించారు.చైనా, దక్షిణ కొరియా తర్వాత ఇటలీ నత్తలను ఎక్కువగా పెంచుతుంది.
కానీ నీలి రంగు పీతలు తినేయడం వల్ల నత్తల సంఖ్య తగ్గుతుంది.దీని కారణంతో పీతలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది.
పర్యావరణానికి హాని కలిగించే పీతలను చంపేసేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు.మత్స్యకారులు వీలైనంత వరకు పీతలను పట్టుకుని వాటిని నాశనం చేయాలని ప్రబుత్వం సూచించింది.