ఐదు నిమిషాల్లో భోజనాన్ని ముగిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

సాధారణంగా కొందరు భోజనాన్ని( Food ) చాలా నెమ్మదిగా తింటుంటారు.భోజనాన్ని పూర్తి చేయడానికి క‌నీసం ఇరవై నిమిషాలు అయినా కేటాయిస్తుంటారు.

 What Happens If Eating Food Too Quickly! Eating Food, Fast Eating, Fast Eating S-TeluguStop.com

కానీ, కొందరు అలా కాదు.ఎవ‌రో వెన‌క త‌రుముతున్న‌ట్లు త్వరత్వరగా ఫుడ్ తినేస్తుంటారు.

జస్ట్ ఐదు నిమిషాల్లో భోజనాన్ని ముగించేవారు కూడా మ‌న‌లో ఎందరో ఉన్నారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పకుండా తెలుసుకోండి.

Telugu Fast, Fast Effects, Tips, Healthy, Latest-Telugu Health

త్వరత్వరగా భోజనాన్ని ముగించడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు బలంగా చెబుతున్నారు.వేగంగా భోజనాన్ని పూర్తి చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.ఐదు నిమిషాల్లో భోజనాన్ని ముగించడం వల్ల ఇన్సులిన్( Insulin ) నిరోధకత పెరిగిపోతుంది.

ఫలితంగా మధుమేహం తలెత్తే అవకాశాలు భారీగా రెట్టింపు అవుతాయి.

Telugu Fast, Fast Effects, Tips, Healthy, Latest-Telugu Health

అలాగే త్వరత్వరగా భోజనం చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు.ఎందుకంటే, వేగంగా తిన‌డం వ‌ల్ల ఎంత తిన్నా కూడా తృప్తి చెంద‌లేదు.దీంతో ఎక్కువ‌గా ఫుడ్ ను లాగించేస్తుంటారు.

ఇదే క్రమంగా కొనసాగితే మీ శరీర బరువు అదుపు తప్పుతుంది.ఓవర్ గా వెయిట్ గెయిన్ అవ్వ‌డం వ‌ల్ల శ‌రీర ఆకృతి పూర్తిగా మారిపోవ‌డ‌మే కాదు.

గుండెపోటు ఊబకాయంతో సహా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.అంతేకాదు వేగంగా భోజనాన్ని పూర్తి చేయడం వల్ల ఆహారం త్వ‌ర‌గా జీర్ణం కాదు.

దాంతో జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడి మెల్లగా దాని పనితీరు తగ్గిపోతుంది ఫలితంగా అజీర్తి, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive problems ) తలెత్తుతాయి.అందుకే ఐదు నిమిషాల్లో భోజనాన్ని ఎప్పుడు ముగించకూడదు.

నెమ్మదిగా తినాలి.బాగా నములుతూ తినాలి.

అప్పుడే తక్కువగా తింటారు.నెమ్మదిగా న‌ములుతూ ఆహారం తినడం వల్ల బరువు తగ్గుతారు.

కొంచెం తిన్న మంచి తృప్తి కలుగుతుంది.పైగా తిన్న ఆహారం త్వరగా కూడా డైజెస్ట్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube