మొన్నటి వరకు తెలంగాణలో బిజెపి( Telangana BJP ) గ్రాఫ్ బాగానే కనిపించింది .ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బిజెపి కనిపించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి , బీఆర్ఎస్ మధ్య ప్రధాని పోటీ ఉంటుందని అంతా భావించారు .తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి బిజెపి గ్రాఫ్ అమాంతం తగ్గినట్టుగా కనిపిస్తోంది.ప్రధాన పోటీ అంతా బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అన్నట్లుగా పరిస్థితి నెలకొనడంతో తెలంగాణ బిజెపిలో నిరుత్సాహం కనిపిస్తోంది.ప్రస్తుతం తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు బిజెపికి కరువయ్యారు .కొన్ని నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల అభ్యర్థులను వెతుక్కోవాల్సి న పరిస్థితి ఏర్పడింది.గతంలో కేంద్ర బిజెపి పెద్దలు తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో అప్పట్లో ఆ ప్రభావం కనిపించింది .అయితే ఈ మధ్యకాలంలో బిజెపిలోకి పెద్దగా చేరికలు లేకపోవడం, కాంగ్రెస్ వైపు బిజెపి , బీఆర్ఎస్ ( BRS )నేతలు క్యూ కడుతూ ఉండడం వంటివి బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.

ఇక బీఆర్ఎస్ ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, కాంగ్రెస్ మొదటి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.కానీ ఇంకా బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.దీంతో నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో బిజెపి వెనుకబడిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను వెతుక్కోవడం బిజెపికి( BJP ) ఇబ్బందికరంగా మారింది. 30 నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉన్నా, మిగిలిన చోట్ల గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో నేతలు లేకపోవడంతో బిజెపి అగ్రనాయకత్వం అభ్యర్థుల ప్రకటన విషయంలో ఇంకా ఆచి తూచి వ్యవహరిస్తోంది.
తెలంగాణలో బిజెపి గెలిచే అవకాశం లేకపోవడంతోనే , జనసేన ,టిడిపి( TDP , janasena ) పొత్తు కోసం ప్రయత్నం చేస్తోంది.

తాజాగా పొత్తులో బాగంగా జనసేన కు 12 సీట్లు కేటాయించినట్లు సమాచారం.ఇక టిడిపి విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదట .దీంతో పాటు బిజెపిలో పెద్ద ఎత్తున అసంతృప్త నాయకులు ఉండడంతో, వారిని బుజ్జగించే పనికి శ్రీకారం చుట్టింది.ఈ విధంగా ఎన్నో రకాల పరిస్థితులు తెలంగాణలో బిజెపి పరిస్థితిని గందరగోళంగా మార్చాయి.కీలకమైన ఎన్నికల సమయంలో ఈ తరహా పరిస్థితులు తలెత్తడం, ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళన ఆ పార్టీ నాయకులు కనిపిస్తోంది.







