కాలిఫోర్నియా ప్రభుత్వ యంత్రాంగంలో ఇద్దరు ప్రవాస భారతీయులకు కీలక పదవి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలుగా వారు రాణిస్తున్నారు.

 Indian Americans Raj Bhutoria And Avanti Ramraj Appointed To Key Positions In Ca-TeluguStop.com

భారతీయుల శక్తి సామర్ధ్యాలపై నమ్మకం ఉంచి వారికి ఉన్నత పదవులు కట్టబెడుతోంది అక్కడి ప్రభుత్వం.తాజాగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఇద్దరు భారతీయ అమెరికన్లకు పరిపాలనా యంత్రాంగంలో కీలక బాధ్యతలు కట్టబెట్టారు.

గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.ఫ్రీమాంట్‌కు చెందిన రాజ్ భూటోరియా, శాంటా క్లారాలకు చెందిన అవంతి రామ్‌రాజ్‌ను కాలిఫోర్నియా యూత్ ఎంపవర్‌మెంట్ కమీషన్‌లో నియమించారు.డెమొక్రాటిక్ పార్టీకి చెందిన భూటోరియా.2023 నుంచి Snapprలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.అంతకుముందు 2022 నుంచి 2023 వరకు యాక్సెంచర్‌లో స్ట్రాటజీ అనలిస్ట్‌గా , 2019 నుంచి 2021 వరకు ఫైనాన్షియల్ ఎకనామిక్స్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చర్‌గా పనిచేశారు.

Telugu Avanti Ramraj, Calinia, Gavin Newsom, Linia, Raj Bhutoria, Snappr-Telugu

భూటోరియా 2019లో అప్పెల్ రైటింగ్ ఫెలోగా.BYTON Electric Carsలో బిజినెస్ స్ట్రాటజీ స్పెషలిస్ట్‌గా, 2018లో అల్మెడ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయానికి లీగల్ అసిస్టెంట్‌గానూ వ్యవహరించారు.ఫై బీటా కప్పా హానర్ సొసైటీలో సభ్యుడిగా, 2016లో కాంగ్రెస్‌మెన్ రో ఖన్నా స్టూడెంట్ అడ్వైజరీ కమిటీకి చైర్‌గానూ వ్యవహరించారు.

క్లారెమాంట్ మెక్‌కెన్నా కాలేజీ నుంచి ఎకనామిక్స్ , కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.

Telugu Avanti Ramraj, Calinia, Gavin Newsom, Linia, Raj Bhutoria, Snappr-Telugu

ఇక అవంతి విషయానికి వస్తే.2024 నుంచి రీడిస్ట్రిబ్యూట్ అన్‌యూజ్డ్ మెడిసిన్ (ఎస్ఐఆర్‌యూఎం) సపోర్టింగ్ ఇనిషియేటివ్స్‌లో ఇంటర్న్‌గా వ్యవహరించారు.2023 నుంచి స్టాన్‌ఫోర్డ్ మెడికల్ స్కూల్‌లోని బ్రూక్స్ ల్యాబ్‌లో క్లినికల్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా, 2019 నుంచి కాలిఫోర్నియా స్టేట్ ట్రెజరర్ కార్యాలయంలో ఇంటర్న్‌గా ఉన్నారు.2018 నుంచి 2021 వరకు ఆసియా పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ పబ్లిక్ అఫైర్స్ అసోసియేషన్‌కు ఇంటర్న్‌‌గా వ్యవహరించారు.2020లో కాలిఫోర్నియా డెమొక్రాటిక్ ఫండ్ రైజింగ్ అసోసియేషన్‌కు ఆర్గనైజర్‌గా, స్టాన్‌ఫోర్డ్ ఉమెన్ ఇన్ మెడిసిన్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యురాలిగానూ అవంతి పనిచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube