నాని శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela ) కాంబినేషన్ లో తెరకెక్కిన దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా నటిగా ఆమెకు సైతం మంచి పేరు వచ్చింది.
దాదాపుగా 70 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన దసరా నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించడం కొసమెరుపు.నాని శ్రీకాంత్ కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )హీరోయిన్ గా ఎంపికయ్యారనే సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట రష్మిక పేరును పరిశీలించారు.నాని, రష్మి( Rashmika Mandanna (క కాంబినేషన్ లో ఇప్పటికే దేవదాస్ సినిమా తెరకెక్కగా దేవదాస్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.మరోసారి ఈ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని భావించినా సినిమాలో ఇంటిమసీ సీన్స్ ఉండటం, ఇతర కారణాల వల్ల రష్మిక కంటే జాన్వీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
నాని రష్మికతో ఇంటిమసీ సీన్స్ లో నటిస్తే ఒక హీరో ఫ్యాన్స్ ఫీలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రష్మికను సంప్రదించకుండానే జాన్వీ కపూర్ ను ఓకే చేసినట్టు తెలుస్తోంది.జాన్వీ ఈ సినిమాలో నటించడం వల్ల బిజినెస్ పరంగా కూడా సినిమాకు ఆమె ప్లస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.వరుస విజయాలతో నాని మార్కెట్ పెరుగుతుండగా నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు.
సరిపోదా శనివారం మూవీ ఆగష్టు నెల చివరి వారంలో విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకావాల్సి ఉంది.విభిన్నమైన కథలను ఎంచుకోవడం ద్వారా నాని అంచనాలకు మించి కెరీర్ పరంగా ఎదుగుతున్నారు.
మిడిల్ రేంజ్ హీరోలలో టాప్ లో ఉన్న నాని 100 కోట్ల రూపాయల షేర్ సొంతం చేసుకునే స్థాయికి ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.