వైరల్ వీడియో: ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్ని కష్టాలో.. చిటికలో బైక్ సెంటర్ స్టాండ్..

ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న పనికి కూడా బయటకు వెళ్లేందుకు వాహనాలపై ఆధారపడి పోతున్నాం.ఏ చిన్న వస్తువు తీసుకొని రావాలన్నా.

 This Man Found Easy Way Use The Scooter Center Stand Details, Viral Video, Scoot-TeluguStop.com

కూడా స్కూటీ లేదా బైక్ ను ఉపయోగించి చాలా సులువుగా వెళ్లి తీసుకొని వస్తున్నం.అయితే ప్రస్తుతం బైక్స్ కంటే ఎక్కువగా స్కూటీ( Scooty ) వాడకంపై ఇష్టం చూపిస్తున్నారు.

గతంలో మహిళలు స్కూటీలను ఎక్కువగా ఉపయోగించేవారు.కానీ.

ప్రస్తుతం మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా ఇద్దరు సమానంగా స్కూటీలను ఉపయోగిస్తూన్నారు.స్కూటీలు బరువుగా ఉంటాయి కాబట్టి సెంటర్ స్టాండ్( Center Stand ) వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది.

ఈ సమస్య ఎక్కువగా మహిళలలో ఉంటుంది.నిలువుగా సెంటర్ స్టాండ్ వేసే క్రమంలో కొంతమందికి కాళ్లకు గాయాలు కూడా ఆయన సందర్భాలు చాలానే ఉంటాయి.అయితే ఒక వ్యక్తి ఇందుకు తాజాగా చాలా సింపుల్ పరిష్కారాన్ని కనిపెట్టాడు.అతడు సెంటర్ స్టాండ్ వేయడానికి ఒక చిన్న ట్రిక్ చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.సోషల్ మీడియాలో సెంటర్ స్టాండ్ సులువుగా వేసే విధానాన్ని ఒక వ్యక్తి చూపిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారుతుంది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా సెంటర్ స్టాండ్ వేసేందుకు ముందుగా సైడ్ స్టాండ్ వేయాలి.ఆపై సైడ్ స్టాండ్( Side Stand ) వేసిన వైపే స్కూటీని బాగా వంచితే సెంటర్ స్టాండ్ ను వేయడానికి చాలా స్పేస్ ఉంటుంది.ఆ తర్వాత సెంటర్ స్టాండ్ ను కిందికి దించితే సరిపోతుంది.ఇలా చేస్తే చాలా సులువుగా ఎటువంటి కష్టం లేకుండా స్కూటీ సెంటర్ స్టాండ్ ను వేయొచ్చు.

ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ ” ఇన్నాళ్లు ఈ చిట్కా తెలియక చాలా కష్టపడ్డాం” అంటూ కామెంట్ చేశారు.ఇక మరికొందరు అయితే.” బాబాయ్.నువ్వు కేక.” అంటూ కామెంట్ చేసారు.ఇంకొందరు ఇన్నాళ్లు ఎక్కడన్నారు మీరు అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube