సాధారణంగా చాలా మందికి పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి కొందరి జీవితాలు సుఖంగా సంతోషంగా ఉంటే మరి కొందరు జీవితాలు మాత్రం కష్టంతో కూడుకొని ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న భర్త లేదా భార్య బిహేవియర్ తేడాగా ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.సినిమా ఇండస్ట్రీలో అయితే ఇలాంటి సంఘటనలు రోజుకు ఒకటీ జరుగుతూనే ఉంటాయి.
సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటూ వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉంటే విడాకులు తీసుకుని వేరే వారిని పెళ్లి చేసుకుంటారు.ప్రస్తుతం హీరోల జీవితాలలో ఇదే జరుగుతుంది.
అయితే అప్పట్లో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన మోహిని మాత్రం దీనికి భిన్నంగా నడుచుకుంటుంది.మోహిని, బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది.ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ మలయాళంలో మమ్ముట్టి పక్కన ఎక్కువ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది.ఆమె తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా నటించింది.
ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్ సినిమా లో చిరంజీవి చెల్లె గా నటించి మంచి గుర్తింపు సాధించింది.ఈ సినిమాలో తన చెల్లెలని కాపాడుకునే ఒక అన్నగా చిరంజీవి నట విశ్వరూపాన్ని చూపిస్తే మోహిని కూడా చిరంజీవి కి ధీటుగా నటించి చిరంజీవి చేత ప్రశంసలు అందుకుంది.
ఆమె తెలుగులో నటించిన చివరి చిత్రం కలెక్టర్.
ఆమె అమెరికాకు చెందిన భరత్ కృష్ణస్వామి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు.వాళ్లకి కొడుకు పుట్టిన తర్వాత భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు జరగడం స్టార్ట్ అయ్యాయి.మోహిని భర్త అయిన భరత్ వాళ్ళ బాబు తనకు పుట్టలేదని మోహిని కి ఇంకో అబ్బాయి తో ఎఫైర్ ఉందని, మోహిని నాకు అవసరం లేదని విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు.
కానీ మోహిని మాత్రం తనే ఏ తప్పు చేయలేదని ఆ బాబు తనకే పుట్టాడని ఏ పరీక్ష పెట్టిన నేను దానికి సిద్ధం కానీ విడాకులు మాత్రం ఇవ్వను అని మొండిగా తేల్చి చెప్పేసింది.మోహిని తన భర్తని వదలకుండా తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఆయన పెట్టిన పరీక్ష అన్నిటిలో నెగ్గుతూ వచ్చింది.
దీంతో వాళ్ళ అత్త మామలతో సహా భర్త కూడా ఆమె మంచిది అని నమ్మి మళ్లీ యధాతధంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం వాళ్లకు ఇంకొక బాబు కూడా జన్మించాడు.
ఇదంతా జరగడానికి తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఆ దేవుడే తనకు సహాయం చేశాడని మోహిని చెప్తూ ఉంటుంది.అయితే తన భర్త విడాకులు ఇస్తానన్న కూడా ఏ మాత్రం భయపడకుండా తను ఏ తప్పు చేయలేదని నిర్భయంగా చెబుతూనే తనని తాను తప్పు చేయలేదని నిరూపించుకున్నందుకు ఆమె ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి.
ప్రస్తుతం ఎవరైనా ఒక మాట అంటేనే భార్యభర్తలిద్దరు విడిపోతున్న రోజుల్లో భర్త కట్టిన తాళికి గౌరవం ఇస్తూ తాళి విలువ తెలిసిన ఆలిగా మోహిని అందరి హృదయాల్లో నిలిచిపోయింది.సినిమాల్లో హీరోయిన్ గా చేయడమే కాదు నిజజీవితంలోనూ తన భర్త కోసం ఏదైనా చేయగలను అని నిరూపించిన వ్యక్తి మోహిని.
ఈరోజుల్లో సెలబ్రిటీల జీవితాలు ఎలా ఉన్నాయంటే పెళ్లయిన నాలుగు రోజులకే విడిపోతున్నారు.పెళ్లిళ్ల మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నారు.
అలాంటి సెలబ్రిటీల మధ్యలో నుంచి వచ్చిన ఆవిడ ఏ మాత్రం గర్వం లేకుండా తను సెలబ్రిటనీ అని తెలియకుండా నన్ను నా భర్త నిందిస్తే నేను ఎందుకు పడాలి అని అనుకోకుండా మానవత్వంతో తనను తాను ప్రూవ్ చేసుకుని రాముడి పరీక్షలో నెగ్గిన సీతగా మిగిలిపోయింది.