మృదువైన,అందమైన,ఎర్రటి పెదాల కోసం అద్భుతమైన చిట్కాలు

సాధారణంగా ప్రతి ఒక్కరు పెదాలు చాలా ఆకర్షణీయంగా,అందంగా కనపడటానికి మార్కెట్ లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉంటారు.అవి చాలా ఖరీదైనవి.

 Homemade Lip Scrubrecipes-TeluguStop.com

కానీ ఈ కాస్మొటిక్స్ ఎక్కువ కాలం వాడితే పెదాలు పొడిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అలాగే మనం కాస్మొటిక్స్ జోలికి వెళ్లకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని పదార్ధాలతో మృదువైన,అందమైన పెదాలను సొంతం చేసుకోవచ్చు.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ తేనెలో అరస్పూన్ పంచదార కలిపి పెదాలకు రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేయాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని పెట్రోలియం జెల్లీ రాయాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే పెదాలు మృదువుగా మారతాయి.

ఒక స్పూన్ ఓట్ మీల్ లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్,రెండు చుక్కల లావెండర్ ఆయిల్ వేసి బాగా కలిపి పెదాలకు రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేయాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని పెట్రోలియం జెల్లీ రాయాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే పెదాలు మృదువుగా మారతాయి.

ఒక స్పూన్ కలబంద గుజ్జులో అరస్పూన్ కోకో పొడి కలిపి పెదాలకు రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేయాలి.

ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని లిప్ బామ్ రాయాలి.ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే పెదాలు మృదువుగా మారతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube