చదువుకునే ఆసక్తి ఉన్నా.చదవగలిగే సత్తా ఉన్నా.
ఎన్నో మంచి మంచి ర్యాంకులు ఉన్నా సరే ఆర్ధిక భూతం విద్యార్ధులని వెంటాడుతుంది.ఇండియాలో గొప్పగా చదువుతూ విదేశాలలో మరింత గా చదవాలనే కోరిక ఉన్న వాళ్ళు చివరికి సరైన సాయం లేక తమ కలల్ని అక్కడితో ఆపేస్తారు అయితే ఇప్పుడు అలాంటి వారిక కోసం అమెరికా తెలుగు అసోసియేషన్ మ్కుందుకు వచ్చింది.
ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్ళాలని అనుకునే వారికి వచ్చే విద్యార్థులకు సాయం చేసేందుకు అమెరికా తెలుగు అసోసియేషన్ ముందుకొచ్చింది.ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలితో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నది.ఈ ఒప్పందం వల్ల తెలంగాణ రాష్ట్రం నుంచి అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు సెమినార్స్ నిర్వహిస్తారని, కాలేజీల ఎంపిక, స్కాలర్ షిప్పులు, ఉద్యోగ అవకాశాలు వంటి వివరాలు అందిస్తారని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.
అంతేకాదు అలా వచ్చి చదువుకునే వారికోసం ఒక వెబ్సైటు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక గైడ్స్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్టు అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి చెప్పారు.అక్కడ విద్యార్థుల్లో 30 శాతం మనవాళ్లు ఉండేవారని, ఇటీవల ఆ సంఖ్య తగ్గిందని దానికి కారణం ఆర్ధిక వనరులే నని తెలిపారు.
అయితే కేవలం ఆర్ధిక ఇబందుల వలన వారు తమ కలల్ని కోల్పోకూడదని వారికి తోడుగా మేము ఉంటామని తెలిపారు.