ఆర్ 5 జోన్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
రాజధాని కేసును విచారణ చేస్తున్న బెంచ్ కు కేసును సుప్రీం బదిలీ చేసింది.అయితే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్ జోన్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అమరావతి రైతులు ఆర్-5 జోన్ పై దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
అయితే ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని సూచించింది.దీంతో అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.