సామాజిక మాధ్యమాల్లో స్నాప్‌చాట్ కున్న ప్రత్యేకంగా అందరికీ తెలిసిందే.అదిరిపోయే ఫీచర్స్‌తో యువతను అమితంగా ఆకట్టుకుంటోన్న యాప్స్ లలో ఈ మెసేజింగ్ యాప్ ఒకటి.
గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్, ఫొటో, వీడియో ఎడిటింగ్ టూల్స్ ఇలా రకరకాల ఆప్షన్ల వలన ఇది యువతకు మరింత చేరువ అయింది.ఈ ఫీచర్స్‌నే వాడుకుంటూ స్నాప్‌చాట్( Snapchat ) వేదికగా కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.
యువతను టార్గెట్ చేస్తూ వారి భవితను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.అవును, వారికి మీ బలహీనతే బలం.ఆదమరచి ఉన్నట్టు అనుమానం వస్తే చాలు ఉచ్చులో చిక్కుకునేలా చేస్తారు.

సామాజిక మాధ్యమాలపై కన్నేసిన వెబ్ దుండగులు అధునాతన ఫీచర్లు కలిగిన స్నాప్‌చాట్‌ను ఇప్పుడు సైబర్ నేరాలకు( Cyber crimes ) అడ్డాగా మార్చుకుంటున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి.అకౌంట్ హ్యాకింగ్, లైంగిక వేధింపులు, వ్యక్తిగత సమాచార తస్కరణ లాంటి మోసాలకు పాల్పడుతున్నారు.ప్రైవసీ సెట్టింగ్స్‌లో చిన్నపాటి తప్పున్నా ఆన్‌లైన్లోనే వెతికి పట్టుకొని మరీ రెచ్చిపోతున్నారు.
మన యాక్టివిటీస్ ఆధారంగా వల పన్ని టార్గెట్ చేస్తారు.అన్ని రకాల సామాజిక మాధ్యమాల్లో ఉన్నట్టుగానే వివిధ ఆకర్షణలు ఇక్కడ కూడా ఉంటాయి.
చాట్, వీడియోకాల్ రికార్డులు అడ్డుపెట్టుకొని డబ్బులు డిమాండ్ చేస్తారు.

ఇక స్నాప్‌మ్యాప్( Snap map ) ద్వారా మనం ఎక్కడున్నది అవతలి వారు తెలుసుకోవచ్చు.సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆ ఆప్షన్‌ను సవరించుకుంటే ఆ ఆప్షన్‌ను మీ దగ్గరి వారికి మాత్రమే పరిమితం చేయొచ్చు.అలాగే స్నాప్‌చాట్‌లో వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తులను మాత్రమే యాడ్ చేయడం మంచిది.
ఇక ఎంత తెలిసిన వారికైనా వ్యక్తిగత ఫొటోలు, సున్నితమైన అంశాలు, శృంగారభరిత సందేశాలు పంపడం పెనుప్రమాదాలకు దారితీస్తుంది.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను అస్సలు క్లిక్ చేయకండి.
ఒకవేళ లింక్ క్లిక్ చేసినప్పుడు వ్యక్తిగత వివరాలు షేర్ చేయకండి.ఇక స్నాప్‌చాట్ యాప్‌ను ఎప్పటికప్పుడు ప్లేస్టోర్ ద్వారా అప్‌డేట్ చేసుకోండి.
స్నాప్‌మ్యాప్‌లో సెట్టింగ్స్ పక్కాగా ఉండేలా చూసుకోండి.అవసరం లేదనుకుంటే ఆ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవడం ఉత్తమం.
ఇలా పలు జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్ గా ఉండొచ్చు.







