మోడీజీ.. ఇవన్నీ కనిపించవా ?

గత కొన్నాళ్లుగా దేశంలో ఈడీ చేస్తున్న రైడ్ లు సంచలనలు సృస్టిస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా ఈడీ వ్యవహరిస్తుందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

 Bjp Mla Son Has Been Caught Red-handed Taking Bribes ,modi, Bjp, Brs , Ktr , Kar-TeluguStop.com

మోడి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై మాత్రమే కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు చేసే అక్రమాలు మోడీ ప్రభుత్వానికి కనిపించవా ? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.కాగా మోడీ సర్కార్ పై తెలంగాణ ఐటీ శాఖామంత్రి కే‌టి‌ఆర్ ఇటీవల సంధించిన ప్రశ్నలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.

Telugu Amit Shah, Karnataka Mla, Modi, Pm Modi, Virupakshappa-Politics

ఇటీవల కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు 40 లక్షలు లంచం తీసుకుంటే.అతనిపై ఎలాంటి చర్యలు ఉండవా ? అధానికి చెందిన ముద్రా పోర్టులో రూ 21 వేల కోట్ల విలువగల హెరాయిన్ దొరికితే.దానిపై ఎలాంటి చర్యలు తీసుకోరా ? ఇటీవల అధానిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధానిని విచారణకు పిలవగలరా ?, ఈ తోమిదేళ్ళలో 9 ప్రభుత్వాలను కూల్చిన మాట నిజం కదా ? అంటూ ఇలా ఘాటైన ప్రశ్నలు మోడీ సర్కార్ కు సంధించారు మంత్రి కే‌టి‌ఆర్.అయితే కే‌టి‌ఆర్ సంధించిన ప్రశ్నలలో నిజం లేకపోలేదు.

అధాని కంపెనీలపై ఎన్నో ఆరోపణలు ఈ మద్యకాలంలో వచ్చినప్పటికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు మోడీ సర్కార్, ఎందుకంటే మోడీ సర్కార్ కు మరియు గౌతమ్ ఆధానికి మద్య మంచి సన్నిహిత్యం ఉందనే సంగతి జగమెరిగిన సత్యం.ఇక ఇటీవల కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కొడుకు బహిరంగంగానే 40 లక్షల రూపాయలు లంచం అడిగిన సంగతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Telugu Amit Shah, Karnataka Mla, Modi, Pm Modi, Virupakshappa-Politics

అయినప్పటికి ఇంతవరుకు దీనిపై మోడీ సర్కార్ నోరు మేడపలేదు.ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ చేస్తున్న అక్రమాలన్నీ కప్పిపుచ్చుతూ… కేవలం విపక్ష నేతలే టార్గెట్ గా మోడీ సర్కార్ వ్యవహరిస్తోందనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.ఇప్పటివారు దేశం మొత్తం మీద 5,422 ఈడీ కేసులు నమోదు కాగా వాటిలో కేవలం 22 కేసులే శిక్షకు గురయ్యాయి.ఈ కేసులన్నిటిలో దాదాపు విపక్ష నేతలపైనే అధికంగా ఉన్నాయి.

మరి బీజేపీ నేతలు ఎలాంటి అవినీతికి పాల్పడడం లేదా ? అనే ప్రశ్నలు రాక మానవు.మరి కేవలం విపక్ష నేతలే టర్గెట్ ఎందుకు ? బీజేపీ నేతలు చేస్తున్న మరియు మోడీ సర్కార్ లో జరుగుతున్నా అక్రమాలు ప్రధాని మోడీకి కనిపించవా ? అనే ప్రశ్నలు ప్రతిఒక్కరిలో ఉత్పన్నమౌతున్నాయి.మరి వీటికి ప్రధాని మోడీ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube