గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభంజనం ఏ స్థాయిలో కొనసాగిందో అందరికీ తెలిసిందే.ఇంతవరు ఏపీ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించనంత మెజారిటీ సీట్లతో వైసీపీ విజయకేతనం ఎగురవేసిన సంగతి విధితమే.151 అసెంబ్లీ స్థానాలను 23 పార్లమెంట్ స్థానాలను వైసీపీకి కట్టబెట్టారు ఏపీ ప్రజలు.అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఈ స్థాయిలో విజయం సాధించదేయనికి చాలానే కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా జగన్ అందుకున్నా ” ఒక్కచాన్స్ “ నినాదం ప్రజల దృష్టి జగన్ పై పడేలా చేసింది.అంతే కాకుండా అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత నెలకొనడం, ఇంకా జనసేన టీడీపీ ఓటు బ్యాంక్ ను భారీగా చీల్చడం వంటి పరిణామాలు వైసీపీకి కలిసొచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంచితే ఇక వచ్చే ఎన్నికల్లో అంతకు మించి అనేలా 175 స్థానాల్లోనూ విజయం సాధించాలనే టర్గెట్ పెట్టుకున్నారు వైఎస్ జగన్.అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ పాలనపై చాలానే వ్యతిరేకత కనిపిస్తోంది.సంక్షేమం తప్ప అభివృద్ది గాలికి వదిలేశారని జగన్ సర్కార్ పై భారీగా ప్రజల్లో వ్యతిరేక భావం నెలకొంది.దీంతో ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఏపీ ప్రజలు గట్టి షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి.
కాగా ఈసారి వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
గత ఎన్నికల్లో చిత్తూరు, కర్నూల్, నెల్లూరు, కడప.జిల్లాలలో తిరుగులేని ఆధిక్యం కనబరిచింది.అయితే ఈ జిల్లాలో ప్రస్తుతం వైసీపీపై వ్యతిరేక గాలి విస్తోంది.
ముఖ్యంగా జగన్ సొంత జిల్లాలో కూడా జగన్ కు వ్యతిరేక గళం వినిపిస్తోంది.దాంతో వైసీపీ కంచుకోటగా ఉండే జిల్లాలపై టీడీపీ, జనసేన గట్టిగా దృష్టి సరిస్తున్నాయి.
ఎందుకంటే వైసీపీ కంచుకోటలను జగన్ కు దూరం చేస్తే.వచ్చే ఎన్నికల్లో వైసీపీ దూకుడుకు సులువుగా అడ్డుకట్ట వేయవచ్చనే ఆలోచనలో పవన్, చంద్రబాబు ఉన్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ టీడీపీ జనసేన పార్టీలు పొత్తు కలిస్తే ఈ జిల్లాల్లో వైసీపీకి భారీగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మరి వైసీపీ కంచుకోటలను బద్దలు కొట్టడానికి టీడీపీ- జనసేన ఎలాంటి ప్రయత్నాలు చేస్తాయో చూడాలి.