ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేశస్తులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా వాస్తు శాస్త్రాన్ని చాలామంది ప్రజలు నమ్ముతారు.అంతేకాకుండా జ్యోతిష్యంలో, వాస్తు శాస్త్రంలో ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉన్నాయి.
వాస్తు శాస్త్రం మరియు జ్యోతిష నియమాలను అనుసరించే వ్యక్తి జీవితంలో ప్రతి పనిలో విజయం సాధిస్తారని ఎక్కువగా నమ్ముతారు.దీని వల్లే ఇప్పటివరకు వాస్తు శాస్త్రానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది.
స్నానం చేసేటప్పుడు మీరు ఉపయోగించాల్సిన వాస్తు శాస్త్ర నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఒక్క వాస్తు శాస్త్రం యొక్క ఈ నియమం పాటించడం వల్ల మీ గ్రహాల స్థితిని బలోపేతం చేసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా దూరమవుతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
స్నానం చేసేటప్పుడు కచ్చితంగా ఈ వస్తువులను కలపడం వల్ల పేదరికం కూడా దూరం అవుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసే ముందు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి దూరమవ్వాలంటే స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకోవడం మంచిది.దీని వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, డబ్బుకు ఎప్పటికీ లోటు ఉండే అవకాశం ఉండదు.
అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు.జాతకంలో ఉన్న శుక్ర గ్రహం యొక్క స్థితిని బలోపేతం చేయడానికి, అంతేకాకుండా సంతోషకరమైన వైవాహిక జీవితం జీవితాన్ని గడపడానికి కూడా ప్రతి శుక్రవారం స్నానం చేసే నీటిలో పటిక ను కలపడం ఎంతో మంచిది.

ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందంతో పాటు భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగే అవకాశం ఉంది.మరోవైపు స్నానం చేసే నీటిలో కొద్దిగా నెయ్యి కలుపుకుని తాగితే రోగాలు దూరమవుతాయి.వాస్తు శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్న గురు దేవుడైన బృహస్పతి దోషాన్ని తొలగించడానికి నీటిలో పసుపు కలిపి దానితో గురువారం స్నానం చేయడం ఎంతో మంచిది.అదే సమయంలో మీ జీవితంలో శుభవార్త వినడానికి ఎల్లప్పుడూ స్నానపు నీటిని నీటిలో గందన్ని కలపడం మంచిది.
అంతేకాకుండా మీ అదృష్టం పెరగాలంటే ఎల్లప్పుడూ స్నానం చేసే నీటిలో నువ్వులు కలిపి స్నానం చేయడం ఎంతో మంచిది.