ప్రస్తుతం ఆధునిక సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.వీటిలో కొన్ని అనారోగ్య సమస్యలకు చికిత్స ఉంటే, మరికొన్ని అనారోగ్య సమస్యలకు ఇప్పటివరకు చికిత్స లేదు.
ఏ దేశం కూడా కొన్ని అనారోగ్య సమస్యలకు ఇప్పటివరకు ఎలాంటి చికిత్స ను కనుగొనలేదు.వాటిలో ముఖ్యంగా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను బలికున్నా కారోన వ్యాధికి కూడా ఇప్పటివరకు ఏ దేశం కూడా సరైన చికిత్స ను కనుగొనలేదు.
ఇలాంటి కొత్త రకాల వైరస్ లకు సరైన చికిత్సను కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య శాస్త్రవేత్తలు ప్రతిరోజు రకరకాల పరిశోధనలు చేస్తూనే ఉంటారు.
ఈ మధ్యకాలంలో బోన్ మ్యారో క్యాన్సర్ కు కూడా ఇప్పటివరకు ఎటువంటి చికిత్స లేదు.
అయితే తాజాగా అమెరికా పరిశోధకులు ఈ బోన్ మ్యారో క్యాన్సర్ కు సరికొత్త చికిత్సను కనుగొన్నారు.ఈ చికిత్స విధానంలో టాల్కేటామాబ్ అనే రోగులకు ఇంజక్ట్ చేస్తారు.
రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ కూడా చేశారు.ఎముక మజ్జ క్యాన్సర్ కణాలను నాశనం చేసేందుకు రోగ నిరోధక వ్యవస్థను 73% ప్రేరేపించినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇది క్యాన్సర్ కణాల ఉపరితలంపై ఉన్న జీపీఆర్ సి 5డి అనే గ్రహకాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వారు నిర్ధారించుకున్నారు.ఇంకా చెప్పాలంటే ఎముక లోని మూలుగాలో నుండి మూల కణాలు ఎప్పుడూ తయారై బయటికి వస్తు ఉంటాయి.ఇలాంటి కణాలే తర్వాత ఎర్ర రక్త కణాలుగా, తెల్ల రక్త కణాలు గా, ప్లేట్లైట్స్ గా రూపాంతరం చెందుతూ ఉంటాయి.ములుగలోనే తేడా ఉంటే ఏఎంఎల్ ఏఎల్ఎల్ వంటి కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లు పుట్టుకతో వచ్చే మరికొన్ని జన్యుపరమైన వ్యాధులు రక్తానికి సంబంధించిన ధలసేమియా, సకిల్ సెల్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.