నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ఆయన మిత్రుడు గోపీచంద్ పాల్గొన్న విషయం తెలిసిందే.ఈ వారం ఎపిసోడ్ గా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
బాలకృష్ణ మొహమాటం లేకుండా తన ముందు ఉన్న వారిని అనేక ప్రశ్నలతో సమాధానాలు రాబడుతూ ఉంటాడు.అందుకే ప్రభాస్ అభిమానులు నందమూరి బాలకృష్ణ కు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు.
అదేంటి అంటే.తమ అభిమాన హీరో ప్రభాస్ యొక్క పెళ్లి విషయాన్ని దయచేసి తేల్చండి.
మీరే ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, నిజంగా అనుష్క తో ప్రేమ లో ఉన్నాడా లేదా.ప్రేమ లో ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఏంటి ఇబ్బంది, ప్రేమలో లేకపోతే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏంటి ఇబ్బంది.
ఇలా పెళ్లికి సంబంధించి, ప్రేమకు సంబంధించి ప్రశ్నలను ప్రభాస్ కి వేసి సమాధానాలను రాబట్టాలి అంటూ బాలకృష్ణ కి సోషల్ మీడియా ద్వారా చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రభాస్ యొక్క పెళ్లి విషయమై ఏదో ఒకటి తేలాలని చాలా మంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు, కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.కృష్ణం రాజు బతికి ఉన్న రోజుల్లో పదే పదే ప్రభాస్ యొక్క పెళ్లి గురించి మాట్లాడేవాడు.ఆయన సంబంధాలు చూస్తున్నామంటూ పలు సందర్భాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
ప్రభాస్ మాత్రం ఆ సినిమా తర్వాత.ఈ సినిమా తర్వాత అంటూ మీన మేషాలు లెక్కిస్తూ చాలా వయసు మీద వేసుకున్నాడు.
ఆయన ఓకే అనాలే కాని వారం రోజుల్లోనే పెళ్లి జరిగి పోతుంది.అంగరంగ వైభవం గా టాలీవుడ్ మొత్తం ఆయన పెళ్లి గురించి మాట్లాడుకునే విధంగా చేస్తారు.
కానీ ప్రభాస్ మాత్రం ప్రస్తుతానికి ఆసక్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు.