చాలామంది ప్రజలు కార్తీక మాసంలో పూజలు చేసి దీపాలను వెలిగిస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యఫలితం లభిస్తుందని చాలామంది ప్రజల నమ్మకం.
అంతేకాకుండా పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయని తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయంలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు.సాధారణంగా మార్గ శిర మాసాల్లో, కార్తీకమాసంలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా దీపాలను వెలిగిస్తే పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతూ ఉంటారు.
ప్రత్యేకించి మార్గశిర మాసంలో సూర్యాదానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని కూడా వేద పండితులు చెబుతూ ఉంటారు.బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది.ఆ సమయంలో నిద్ర లేచి తలస్నానం చేసి పూజలు చేయడం వల్ల గొప్ప ఫలితాలు కూడా లభిస్తాయి.బ్రహ్మ ముహూర్తం పూజలకు దోషం లేదు.
ఇది భగవంతుని సమయము కాబట్టి ఆ సమయంలో అపవిత్రత ఉండదు.
బ్రహ్మ ముహూర్త సమయంలో దీపం వెలిగించి దేవతలను పూజిస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలామంది పెద్దవారు నమ్ముతారు.
బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ తర్వాత బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు దీపం వెలిగించడం ఆ ఇంటికి ఎంతో మంచిది.సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు దీపం వెలిగించి పూజ చేయడం కూడా ఎంతో మంచిదే.
ఉదయం బ్రహ్మ ముహూర్తం సమయంలో ఇంట్లో దీపం వెలిగించి శివ మంత్రాన్ని జపించడం వల్ల ఆ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారు.అంతేకాకుండా వాస్తు దోషాలు కూడా దూరమవుతాయి.ఇంకా చెప్పాలంటే ఆ కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉంటే ఆ ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
అందువల్ల ఆ బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగించి పూజ చేయడం వల్ల ఎంతో మంచిది.
DEVOTIONAL