తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) పాలకమండలి చాలా కీలక నిర్ణయాలను తీసుకుంది.ఎండాకాలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది.ఢిల్లీలో శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy ) వారి ఆలయంలో మే 3 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది.10 లక్షలతో వెండి కవచాన్ని శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారికి అందించేందుకు ఆమోదం తెలిపింది.
ఇదే సమయంలో అన్నదాన ప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదం విషయంలో కూడా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.తిరుమల శ్రీవారి నైవేద్యానికి సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే వినియోగించాలని నిర్ణయించింది.
అంతేకాకుండా అన్నదాన ప్రసాదంతో పాటు లడ్డు ప్రసాదాలను కూడా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది.ఇందుకోసం సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ధర నిర్ణయానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు చైర్మెన్ సుబ్బారెడ్డి( Chairman Subbareddy ) వెల్లడించారు.
టీటీడీ అవసరాలకు గాను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు నిర్ణయించారు.ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్ ఫెడ్ తో చర్చించేందుకు టీటీడీ బోర్డు సభ్యులు డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సనత్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కమిటీ ఏర్పాటు చేశారు.అలిపిరి వద్ద గల మార్కెటింగ్ గోడౌన్ వద్ద నూతన గోడౌన్లు నిర్మాణానికి 18 కోట్ల రూపాయలు మరియు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి 14 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
ఇంకా చెప్పాలంటే తిరుపతిలోని స్విమ్స్ పరిధిలో గల శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో టీబీ, చెస్ట్, స్కిన్ ఇతర ఐసోలేషన్ వార్డులు సాఫ్ట్ క్వార్టర్స్ హాస్టల్ నిర్మాణ పనుల కోసం 53.62 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు.గుంటూరుకు చెందిన దాత శ్రీమతి ఆలపాటి తారా దేవి 10 లక్షల రూపాయలతో వెండి కవచన్ని శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి వారికి అందించేందుకు ఆమోదం లభించింది.
DEVOTIONAL