తాజాగా ముంబైలో క్రిటిక్స్ చాయిస్ మూవీ అవార్డ్స్( Critics Choice Movie Awards ) కార్యక్రమం జరిగింది.ఇక ఈ అవార్డుల కార్యక్రమంలో హీరో రిషబ్ శెట్టి,హీరోయిన్ సాయి పల్లవికి అవార్డు దక్కింది.
కాగా హీరో రిషబ్ శెట్టి కాంతార సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఈ అవార్డుని అందుకున్నాడు.అలాగే గార్గి సినిమాలో అద్భుతమైన నటనకు గాను హీరోయిన్ సాయి పల్లవి కూడా ఉత్తమ నటిగా అవార్డుని అందుకుంది.
కాగా ఈ అవార్డుల కార్యక్రమంలో భాగంగా హీరో రిషబ్ శెట్టి మాట్లాడుతూ.నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా ధన్యవాదాలు.15 ఏళ్ల క్రితం మొదటిసారి ముంబైకి వచ్చాను.

అందేరి వెస్ట్ లోని ఒక నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయ్( Office Boy ) గా పని చేశాను.15 ఏళ్ల తర్వాత ఇదే ముంబైలో ఉత్తమ నటుడిగా అవార్డుని అందుకున్నాను.అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ క్షణం నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు హీరో రిషబ్ శెట్టి( Rishab Shetty ).అనంతరం హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.ఈ అవార్డుని అందుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది.సినిమా కోసం అందరూ చాలా కష్టపడతారు.ప్రేక్షకుల ప్రేమను ఆస్వాదిస్తున్నారు.ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి ఈ అవార్డులు దోహదపడతాయి అని చెప్పుకొచ్చారు సాయి పల్లవి.

ఇకపోతే హీరో శెట్టి ప్రస్తుతం కాంతార 2 సినిమా( Kantara 2 )లో నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గట్టిగానే శ్రమిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే విడుదలైన పార్ట్ వన్ పాన్ ఇండియా( Pan India ) లెవెల్లో విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.







