ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి .ముఖ్యంగా స్టీల్ ప్లాంట్( Vishaka Steel Plant ) వేదికగా ఆంధ్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.
బారాస ఎంట్రీ తో వేగం పుంజుకున్న ఈ పరిణామాలు కేంద్రం అస్తవ్యస్త ప్రకటనలతో మరింత వేడిగా మారాయి … ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ సీటు పై ఆశలు పెట్టుకున్న జేడీ లక్ష్మీనారాయణ( JD Lakshminarayana ) తాను కూడా ఇందులో భాగమవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది… ఆ దిశగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి … ఐఏఎస్ క్యాడర్ వ్యక్తి ఇంత సినిమాటిక్ గా మాట్లాడడం ఏమిటి అంటూ ఆయన అభిమానులు కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు ….
ఇంతకీ ఆయన చేసిన వాఖ్యలు ఏమిటా అని చూస్తే ఎనిమిది కోట్ల మంది ప్రజలు తలకు ఒక వంద చొప్పున నాలుగు నెలల పాటు ఇస్తే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవచ్చని, స్టీల్ ప్లాంట్ అవసరమైన ముడి సరుకు సప్లై చేయడానికి తాను కూడా బిడ్ వేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు సాధారణ జనం నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి.

ఐదువేల కోట్లను ఎంతమంది నుంచి సేకరిస్తారు ? ప్రజలందరూ నుంచి ఇంత పెద్ద మొత్తం వసూలు చేయడం సాధ్యమయ్యే పనైనా? ఒకవేళ నిజంగా వసూలు చేసినప్పటికీ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన బొగ్గును ఏ రకంగా సమకూర్చగలుగుతారు? అసలు ఇది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే వ్యవహారం ఏనా అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు

సినిమాలో చూపించినట్టు ఒక పాటలో హీరో కోటీశ్వరుడు అయ్యేంత సులువుగా మాట్లాడారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ….ఆచితూచి మాట్లాడే జెడి లక్ష్మీనారాయణ లాంటి వారు కూడా ఎన్నికలకు దగ్గరికి వచ్చేసరికి ప్రజలు నాకర్షించడానికి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని….ఇది పూర్తిస్థాయి పొలిటికల్ స్టంట్ లాగానే చూడాలని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు….
ఏది ఏమైనా సివిల్ సర్వీసెస్పరీక్ష రాసిన జెడి లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి ఇలాంటి సిల్లీ పరిష్కారం చూపించడం మాత్రం విచిత్రంగా ఉంది….







