ప్రతి మనిషికి వృద్ధాప్య ప్రక్రియ అనేది జీవితంలో ఒక భాగం.ఏ మనిషి దీని నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు.
అయితే ఈ వృద్దాప్య ప్రక్రియను కొంత కాలం వాయిదా వేయవచ్చు.వృద్ధాప్య ప్రక్రియలో భాగంగా చర్మంపై వచ్చే సన్నని గీతలు, ముడతలు చూసి చాలా మంది నిరాశకు లోను అవుతూ ఉంటారు.
ఈ వృద్ధాప్య ప్రక్రియ నుండి బయట పడటానికి రకరకాల చికిత్సల కోసం పరుగెడుతూ ఉంటారు.ఆ చికిత్సలు ఖర్చుతో కూడుకున్నవే కాకుండా రిస్క్ తో కూడా కూడుకున్నవి.
అందువల్ల అటువంటి చికిత్సల జోలికి వెళ్లకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్లే ని నేచురల్ పద్దతులను ఉపయోగించటం చాలా మంచిది.ఇప్పుడు ఆ పద్దతిగురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ పద్దతికి కావలసిన పదార్ధాలు
పాలకూర రసం – అరగ్లాసు
తాజా నేరేడు రసం – అరగ్లాసు
ఈ రెండు రసాలను బాగా కలిపి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు త్రాగాలి.ఈ జ్యుస్ ని ఎన్ని రోజులు అయినా త్రాగవచ్చు.
పాలకూరలో ఐరన్ మరియు విటమిన్ ఇ సమృద్ధిగా ఉండుట వలన ఆరోగ్యకరమైన కణాలకు తద్వారా అవి శక్తిని అందిస్తాయి.కణాల జీవితకాలం ఎక్కువగా ఉంటుంది.కణాలు నెమ్మదిగా వయస్సు మీరినప్పుడు, వృధ్ధాప్య లక్షణాలు కూడా మందగిస్తాయి.
నేరేడు పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన అవి శరీరంలో కొత్త రక్త కణాలను రూపొందించటంలో చాలా బాగా సహాయపడతాయి.
కణాల సంఖ్య తగ్గకుండా జాగ్రత్త చేసి మీలో వృద్ధాప్య ఛాయలు ఎక్కువకాలం రాకుండా సాయపడతాయి.