సితారను కనాలని మేము అనుకోలేదు..నమ్రత షాకింగ్ కామెంట్స్!

టాలీ వుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత గురించి పరిచయం అవసరం లేదు.మహేష్ బాబుతో కలిసి నటించిన ఈమె అతనితో ప్రేమలో పడి వివాహం మహేష్ బాబును వివాహం చేసుకున్నారు.

 We Didnt Expect To See Sitara Namrata Shocking Comments Details, Sitara,namrata-TeluguStop.com

వివాహం తర్వాత సినిమాలకు దూరమై పూర్తిగా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇంటికి పరిమితమయ్యారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ…మహేష్ బాబు సినిమాలలో తనకు పోకిరి సినిమా అంటే చాలా ఇష్టమని వంశీ సినిమా నచ్చని సినిమా అని తెలియజేశారు.

ఇక మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలో బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అనే డైలాగ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలియజేశారు.

ఇకపోతే పెళ్లి అయిన తర్వాత సినిమాలలో నటించకపోవడానికి ఒక కారణం ఉందని తెలిపారు మహేష్ బాబుకు పెళ్లి అంటే ఓ క్లారిటీ ఉందని, పెళ్లి తర్వాత నటించకూడదని ముందుగానే చెప్పినట్లు తెలిపారు.నాకు నటన కన్నా మహేష్ బాబుతో పెళ్లి మూమెంట్ చాలా హ్యాపీయస్ట్ మూమెంట్ అని నమ్రత తెలియజేశారు.

ఒక భార్యగా తల్లిగా తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసమే తాను సినిమాలకు దూరంగా ఉన్నానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇక తన కుమార్తె సితార గురించి కూడా మాట్లాడుతూ సితార మాకు అన్వాంటెడ్ బేబీ.మేము సితారని కనాలని అనుకోలేదు.అయితే సితార లేకపోతే మా జీవితంలో ఎంతో అసంపూర్తి మిగిలి ఉండేదని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇక గౌతమ్ పుట్టిన సమయంలో ఎంతో స్ట్రగుల్ అయ్యామని అసలు గౌతం బతుకుతాడో లేదో అని వైద్యులు చెప్పారని అప్పటి చేదు సంఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ప్రతి ఒక్క కుటుంబంలోనూ కొన్ని బాధలు ఉంటాయి.

మాకు గౌతమ్ పుట్టిన సమయంలో చాలా బాధ కలిగిందని ఈ సందర్భంగా నమ్రత తన వ్యక్తిగత విషయాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube