విశాఖపట్నంకు కార్యాలయాల తరలించవద్దన్న ఏపీ హైకోర్టు స్టేటస్ కోను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.ఈ మేరకు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది.
అలాగే రిట్ పిటిషన్ ను లంచ్ మోషన్ గా తీసుకోవాలని ప్రభుత్వం కోర్టు ముందు మెన్షన్ చేసింది.అయితే అంత అత్యవసరం ఏముందని ప్రభుత్వ తరపు న్యాయవాదిని సీజే ప్రశ్నించారు.
హైకోర్టు ఆదేశాల కారణంగా విశాఖలో జరగాల్సిన రివ్యూ మీటింగ్ తో పాటు ఇతర కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.అయితే ప్రొసీజర్ ప్రకారం మంగళవారమే ప్రభుత్వ వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.