కెరియర్ మొదట్లో అలాంటి కామెంట్స్ చేశారు... ఆ భయంతో సోషల్ మీడియాకు దూరమయ్యా: మృణాల్

సీతారామం ( Sitaramam ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో నటించిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుస తెలుగు సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె నాచురల్ స్టార్ నాని( Nani )తో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తో కూడా సినిమా చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 At The Beginning Of The Career He Made Such Comments , Sitaramam, Mrunal Thakur-TeluguStop.com

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

Telugu Mrunal Thakur, Nani, Sitaramam, Tollywood-Movie

సోషల్ మీడియా వేదికగా ఈమె తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటారు.అదేవిధంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ తన కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు.తాను సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన తర్వాత అవకాశాలను అందుకుంటున్న సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని తెలిపారు.

కెరియర్ మొదట్లో చాలామంది తనను బాడీ షేమింగ్ చేశారని ఈ సందర్భంగా బయటపెట్టారు.ఆరంభంలో కాస్త బొద్దుగా ఉండేదాన్ని.నా శరీరాకృతి మట్కా(కుండ)లా ఉందని చాలామంది కామెంట్‌ చేసేవారు.దాంతో సోషల్‌ మీడియాలో ఫొటోలు పోస్ట్‌ చేయాలంటేనే భయమేసేది.

Telugu Mrunal Thakur, Nani, Sitaramam, Tollywood-Movie

తన గురించి ఇలాంటి కామెంట్స్ రావడంతో తాను సోషల్ మీడియాకు కూడా కొద్ది రోజులపాటు దూరంగా ఉన్నానని తెలిపారు.అయితే ఒక రోజు తాను అమెరికా వెళ్లిన తర్వాత అక్కడ కొందరు ‘ఇండియన్‌ కర్దాషియన్‌’ అన్నారు.దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.అప్పటినుంచి ట్రోల్స్‌ని పట్టించుకోవడం మానేసి, ధైర్యంగా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేయడం మొదలు పెట్టాను అంటూ ఈ సందర్భంగా కెరీర్ మొదట్లో తనుకు ఎదురైనటువంటి చేదు సంఘటనల గురించి మృణాల్ ఠాగూర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube