మొన్నటివరకు మెగా కోడలు ( Mega daughter-in-law )అనగానే అందరికీ రామ్ చరణ్ భార్య ఉపాసన గుర్తుకు వచ్చేది.ఇక ఎప్పుడైతే లావణ్య త్రిపాఠి వరుణ్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుందో అప్పటి నుండి తను కూడా మెగా కోడలు అనే ట్యాగ్ సొంతం చేసుకుంది.
అప్పటివరకు లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi )ని మెగా అభిమానులు కేవలం ఒక హీరోయిన్ గా మాత్రమే అభిమానించారు.ఇక తను కూడా మెగా కోడలు కావడంతో అభిమానం చూపిస్తున్నారు మెగా ఫ్యాన్స్.
ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అటువంటిది కాబట్టి.

టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తొలిసారిగా అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయింది.ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య.
అంతే కాకుండా హిందీలో, తమిళ భాషల్లో కూడా కొన్ని సినిమాలలో నటించింది.స్టార్ హీరోల సరసన సైతం నటించింది.
ఆ మధ్య పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు లావణ్యను నిరాశపరిచాయి.ఈ మధ్య ఓటీటీ( OTT ) లో విడుదలయ్యే సినిమాలలో కూడా నటిస్తుంది.
ఆ ప్లాట్ఫారం వేదికగా కొంతవరకు సక్సెస్ అందుకుంటుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తుంది.
ఇక తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేసుకుంటుంది.ఇక తనతో కలిసి నటించిన వరుణ్ తేజ్( Varun Tej ) తో ప్రేమలో పడగా రీసెంట్ గా కుటుంబ సమక్షంలో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు.ఇక త్వరలో పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకోనున్నారు.
ఇక వీరి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి వీరి గురించి ఏదో ఒక వార్త బాగా వైరల్ అవుతూనే ఉంది.అంతే కాకుండా గతం లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు మెల్లిమెల్లిగా లీక్ చేస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు.
ఇక లావణ్య ముందు నుంచి బాగా ఫోటోషూట్లు చేయించుకుంటూ వస్తుంది.ఇక మెగా కోడలిగా మారాక కూడా బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటుంది.తాజాగా తను తన ఇన్స్టాలో రెండు ఫోటోలు పంచుకుంది.అందులో నెట్ తో కూడిన వైట్ కలర్ చీర కట్టుకోగా అందులో చాలా అందంగా కనిపించింది.
ఇక ఆ ఫోటో చూసిన తన ఫాన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.

పెళ్లి కళ అప్పుడే వచ్చేసింది అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.ఇక మెగావారికి తగ్గట్టు కోడలు దొరికింది అంటూ మరికొందరు పైకి ఎత్తుతున్నారు.ఇక ఆ ఫోటోలో తను ఎంగేజ్మెంట్ రింగ్ తీయకుండా అలాగే పెట్టుకొని ఉంచుకోవటంతో.
వరుణ్ తొడిగిన రింగును అస్సలు వదలట్లేదు కదా.ఇప్పుడే ఇంత ప్రేమ చూపిస్తే పెళ్లయ్యాక ఇంకా ఎంత ప్రేమ చూపిస్తుందో అని అంటున్నారు.మామూలుగా ఎవరైనా సెలబ్రిటీ జంటలు ఎంగేజ్మెంట్ చేసుకుంటే కొన్ని రోజులకే ఆ రింగ్స్ తీసి పక్కకు పడేస్తూ ఉంటారు.కానీ లావణ్య అలాగే ఉంచుకోవడంతో మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు.







