ఆర్‌ఆర్ఆర్‌ ఈ అవార్డులతో సరిపెట్టుకోవాల్సిందేనా..? ఆస్కార్‌ వరకు వెళ్లేనా?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరో లుగా రూపొందిన ఆర్ఆర్ఆర్‌ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రూ.1300 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన జక్కన్న సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఓ రేంజ్ హిట్‌ దక్కించుకుంది.అద్భుతమైన ఈ సినిమా కు సంబంధించిన కలెక్షన్స్ మాత్రమే కాకుండా అవార్డులు మరియు అరుదైన గౌరవాలు కూడా ఎన్నో ఉన్నాయి.

 Rajamouli Rrr Movie Oscar Award News Details, Ntr, Rajamouli, Ram Charan, Rrr, R-TeluguStop.com

ఈ సినిమా తాజాగా గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ను దక్కించుకున్న విషయం తెలిసిందే.అమెరికన్ ప్రతిష్టాత్మక అవార్డులను ఎన్నో సొంతం చేసుకున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి అవార్డులకు నామినేట్ అవ్వడం ఇండియన్ సినీ ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంది.

అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలి అనే ఆశతో ఎదురు చూస్తున్నారు.రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ సినీ అభిమాని కూడా ఈ సినిమా ఆస్కార్ నామినేట్ అయితే చూడాలని.

అక్కడ అవార్డు దక్కించుకోవాలని ఆశ పడుతున్నారు.

కానీ అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి తన కథనం లో గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ దక్కించుకున్న ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ దక్కించుకోవడం కష్టమే అన్నట్లుగా కథనం రాసింది.కానీ ఇండియన్ సినీ పేక్షకులు మాత్రం కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్‌ అవార్డు ను సొంతం చేసుకొని తీరుతుంది అంటూ ధీమా తో ఉన్నారు.ఇదే సమయం లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కుతుందని.

నామినేషన్స్ తోనే సరి పెట్టుకోకుండా అవార్డు ను కూడా అందుకుంటుందని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు.ఏం జరుగుతుందో చూడాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube