మహేష్ పై కామెంట్స్ చేసిన తారక్.. ఆ విషయంలో ఈర్ష్యగా ఉంది అంటూ..!

బుల్లితెర ప్రేక్షకులు అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు లాస్ట్ ఎపిసోడ్ తాజాగా జెమినీ టివిలో నిన్న ప్రసారం అయ్యింది.ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు హాట్ సీట్ లో కూర్చుని గేమ్ ఆడాడు.

 Ntr Interesting Comments On Mahesh Babu, Evaru Meelo Koteeswarulu,mahesh Babu,nt-TeluguStop.com

ఈ ఎపిసోడ్ అన్ని ఎపిసోడ్స్ కంటే బాగా అలరించిందనే చెప్పాలి.టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదిక మీద కనిపించడంతో ఈ ఎపిసోడ్ కు హైప్ బాగానే వచ్చింది.

అందులోను ఈ ఎపిసోడ్ ప్రోమోలను వదులుతూ జెమిని టీవీ యాజమాన్యం మరింత క్యూరియాసిటీ పెంచడంతో ఈ ఎపిసోడ్ కోసం తెలుగు బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూసారు.ఇక వారి ఎదురు చూపులకు ఫలితంగా నిన్న వీకెండ్ లో ఈ ఎపిసోడ్ ప్రసారం అవ్వడంతో అందరు ఈ ఎపిసోడ్ ను బాగా ఎంజాయ్ చేసారు.

ఈ ఎపిసోడ్ లో తారక్ మహేష్ బాబు నుండి చాలా విషయాలను రాబట్టాడు.

Telugu Emk, Evarumeelo, Mahesh Babu, Ntr Mahesh Babu-Movie

హాట్ సీట్ లో కూర్చుని మహేష్ 25 లక్షలు సంపాదించాడు.ఇక ఈ ఎపిసోడ్ లో తారక్ మహేష్ తో గేమ్ ఆడించడమే కాకుండా చాలా ఆసక్తికర విషయాలను మాట్లాడుతూ ఒకరికొకరు చాలా విషయాలను షేర్ చేసుకున్నారు.ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ మహేష్ ను చూసి నిన్ను చుస్తే నాకు ఈర్ష్యగా ఉంది అంటూ కామెంట్ చేసాడు.

Telugu Emk, Evarumeelo, Mahesh Babu, Ntr Mahesh Babu-Movie

షోలో భాగంగా మహేష్ తన కూతురు సితార గురించి మాట్లాడారు.సితార తో తనకున్న అనుబంధాన్ని మహేష్ ఈ సందర్భంగా తెలిపాడు.సితారతో నా సంబంధం రోజురోజుకూ మరింత బలపడుతుంది.తండ్రి కావడం చాలా గొప్ప అనుభూతి.సితార తో తండ్రిగా ప్రతి నిముషం ఎంజాయ్ చేస్తున్నాను.ఆనందిస్తున్నాను.

అని మహేష్ చెప్పగా.దీనికి తారక్ కూడా స్పందించారు.

కూతుళ్లు ఉన్న వాళ్ళను చూస్తే తనకు ఈర్ష్యగా అనిపిస్తుందని.మిమ్మల్ని చుసిన కూడా నాకు అలాగే ఉంది.

ఎందుకంటే నాకు ఇద్దరు అబ్బాయిలు కావడంతో కూతురు లేకపోవడంతో కాస్త వెలితిగా అనిపిస్తుందని ఎన్టీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube