ఒకే ఒక్క సాంగ్ తో రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్ గా మారిపోయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్.ఈ అమ్మడు సాంగ్ లో కనిపించిన ముప్పై సెకెండ్స్ లో కన్ను కొట్టిన ఎక్స్ ప్రెషన్ తో ఫేమస్ అయిపోయింది.
ఒక్కసారిగా ఆమె ఎవరనే విషయం తెలుసుకోవడానికి అంతర్జాలంలో వెతకడంతో ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా గణనీయంగా పెరిగిపోయారు.ఆ తరువాత ప్రముఖ ఎండార్స్మెంట్ కంపెనీలు ఆమె దగ్గరకి తమ ఉత్పత్తుల ప్రచారం కోసం క్యూ కట్టాయి.
అలాగే చాలా మంది నిర్మాతలు తమ సినిమాలలో కథానాయికగా తీసుకోవడానికి ప్రయత్నం చేశారు.అన్ని భాషలలో యాడ్స్ విపరీతంగా చేసి రెండు చేతులా ఈ భామ సంపాదించుకుంది.
అయితే సెకండ్ సినిమా ఆఫర్ కోసం మాత్రం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది.ఈ భామ రెండో సినిమా అవకాశం బాలీవుడ్ లో శ్రీదేవి బంగ్లా అనే సినిమాలో వచ్చింది.
అయితే ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు.
ఇక తెలుగులో ఈ అమ్మడుకి ఊహించని విధంగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ సినిమాలో మొదటి అవకాశం వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ప్రియా ప్రకాశ్ టాలీవుడ్ లో మరో ఛాన్స్ కొట్టేసింది.తేజ సజ్జ హీరోగా నూతన దర్శకుడు నాగరాజు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కథానాయికగా ఈమెని ఫైనల్ చేశారు.మలయాళం సినిమా ఇష్క్ కి రీమేక్ గా ఇది తెరకెక్కుతుంది.
మొత్తానికి తెలుగులో మొదటి సినిమా రిలీజ్ కాకుండానే రెండో సినిమా అవకాశం అందుకోవడం ద్వారా తెలుగులో మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవాలనే ప్లాన్ లో ప్రియా ప్రకాష్ ఉన్నట్లు తెలుస్తుంది.