సితార ఎంటర్టైన్మెంట్స్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళీ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ సినిమా రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా తక్కువ డేట్స్ ఇచ్చాడు.
ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో పాత్ర కూడా ఉంది.దాని కోసం చిత్ర యూనిట్ చాలా మంది హీరోలని పరిశీలిస్తున్నారు.
ఈ నేపధ్యంలో యంగ్ స్టార్ రానా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.ఈ సినిమాలో సెకండ్ లీడ్ రోల్ రానా చేస్తాడని ప్రచారం జరుగుతుంది.
ఈ వార్తలపై తాజాగా రానా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ గురించి తనని సంప్రదించారని రానా స్పష్టం చేశాడు.
అయితే ప్రస్తుతం ఈ విషయం ఇంకా చర్చల దశలో ఉందని, పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత మరింత క్లారిటీగా చెప్పగలనని స్పష్టం తెలియజేశాడు.
పవన్ కళ్యాణ్ తో నటించడానికి తాను కూడా ఆసక్తిగానే ఉన్నానని, సినిమా కథ కూడా తనకి నచ్చిందని రానా క్లారిటీ ఇచ్చాడు.
అయితే చిత్ర యూనిట్, రానాకి మధ్య పాత్ర ప్రెజెంటేషన్ విషయంలో కాస్త చర్చలు జరుగుతున్నాయని.అలాగే డేట్స్ పరంగా గ్యాప్ చూసుకొని సినిమాకి ఒకే చెప్పే అవకాశం ఉందని తెలుస్తుంది.
ప్రస్తుతం రానా విరాటపర్వం సినిమా షూటింగ్ లో ఉన్నాడు.దీంతో పాటు బాబాయ్ వెంకటేష్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ కథకి ఒకే చెప్పాడు.
ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది.ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.