తమిళనాడురాష్ట్రంలో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే మేనిఫెస్టోలను ప్రకటించాయి.
అన్నాడీఎంకే పార్టీ మేనిఫెస్టోలో ఉచితాలకు పెద్దపీట వేసింది.అన్నాడీఎంకే బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తుండగా, డీఎంకే కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.
బీజేపీ పార్టీ నుంచి ఇప్పటికే 17 మంది అభ్యర్థులతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది.
బీజేపీ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ప్రముఖ సినీ నటి కుష్బూ ఉండటం గమనార్హం.
గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున కుష్బూ పోటీ చేయాలని ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు.అయితే బీజేపీ మాత్రం కుష్బూకు పోటీ చేసే అవకాశం ఇచ్చింది.మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్న కుష్బూ ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో తెలియాల్సి ఉంది.2020 సంవత్సరంలో కుష్బూ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు.
కుష్బూ తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తం చేశారు.తనకు టికెట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు కుష్బూ కృతజ్ఞతలు తెలపడంతో పాటు తనపై బీజెపీ పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోనని వెల్లడించారు.
థౌసండ్ పిల్లర్ లైట్స్ డివిజన్ నుంచి కుష్బూ పోటీ చేస్తుండగా డాక్టర్ ఎజిలాన్ డీఎంకే పార్టీ నుంచి ఆమెకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు.

సినిమాల్లో సక్సెస్ సాధించిన సెలబ్రిటీలలో కొందరు సెలబ్రిటీలు రాజకీయాల్లో సక్సెస్ అయితే మరి కొందరు సెలబ్రిటీలు మాత్రం ఫెయిల్ అయ్యారు.కుష్బూ రాజకీయాల్లో సక్సెస్ అవుతారో లేదో తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే.ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో పాటు మరి కొంతమంది సెలబ్రిటీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.