తెలుగు దేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న వల్లభనేని వంశీ ఆ పార్టీని వదలడం జరిగింది.ఆయన ఏ పార్టీలో చేరబోతున్నాడు అనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు.
వంశీ వైకాపాలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ తాజాగా ఆయన మాట్లాడిన మాటలను బట్టి అర్థం అవుతుంది.తెలుగు దేశం పార్టీ నాయకులు పలువురు ఆయన్ను బుజ్జగించి పార్టీలో ఉంచేందుకు ప్రయత్నించినా కూడా ఆయన మాత్రం పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చాడు.ఈ నేపథ్యంలోనే తెలుగు దేశం పార్టీపై వంశీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.
2009 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ను వాడుకుని వదిలేశారు అని, అప్పటి నుండి ఎన్టీఆర్ మళ్లీ తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించలేదు అంటూ వంశీ ప్రశ్నించాడు.ఎన్టీఆర్‌ను ఎవరు ఆపేశారు, ఎందుకు ఆపేశారు అంటూ వంశీ ప్రశ్నించాడు.తెలుగు దేశం పార్టీలో ఎన్టీఆర్ ప్రాభవం ఎక్కువ అయితే ఇబ్బంది అనే ఉద్దేశ్యంతో ఆయన్ను అడుకున్నారు అంటూ వంశీ ఆరోపించాడు.
ఇప్పుడు వంశీ చెబుతున్న మాటలు బాగానే ఉన్నాయి.కాని గత పదేళ్లుగా ఈ విషయం గురించి వంశీ ఎందుకు మాట్లాడలేదు అంటూ ఆ పార్టీకి చెందిన వారే కొందరు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీని వదలగానే ఇప్పుడు ఎన్టీఆర్ గుర్తుకు వచ్చాడా అంటూ వంశీని ప్రశ్నిస్తున్నారు.