స్టార్ మా ఛానల్ ను నంబర్ 1 స్థానంలో నిలబెట్టడంలో కార్తీకదీపం సీరియల్( Karthika Deepam Serial ) పాత్ర ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కార్తీకదీపం సీరియల్ కు సీక్వెల్ కాకపోయినా ఆ సీరియల్ కార్తీకదీపం ప్రధాన పాత్రలతో తెరకెక్కడంతో మంచి రెస్పాన్స్ వస్తోంది.కార్తీకదీపం2 సీరియల్ బుల్లితెరపై అదిరిపోయే రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.కార్తీకదీపం2 సీరియల్( Karthika Deepam 2 ) ఒకవైపు అర్బన్ ప్రేక్షకులను మరోవైపు రూరల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.కార్తీకదీపం అర్బన్+రూరల్ రేటింగ్ 12.93 కావడం గమనార్హం.ఈ సీరియల్ రేటింగ్ విషయంలో ఈ సీరియల్ నిర్మాతలు సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో ఈ సీరియల్ రేటింగ్( Karthika Deepam 2 Serial Rating ) పరంగా మరిన్ని సరికొత్త రికార్డులను ఖాతాలో వేసుకునే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.స్టార్ మా ఛానల్ కు ఈ సీరియల్ ఎంతో ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.ప్రేమీ విశ్వనాథ్( Premi Vishwanath ), నిరుపమ్( Nirupam ) లకు ఈ సీరియల్ స్థాయిలో మరే సీరియల్ పేరు తెచ్చిపెట్టే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.కార్తీకదీపం సీరియల్ లోని ప్రధాన పాత్రల్లో వీళ్లిద్దరినీ తప్ప మరెవరినీ ఊహించుకోలేరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కార్తీకదీపం2 సీరియల్ కాన్సెప్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండటం ఈ సీరియల్ కు ఎంతగానో ప్లస్ అయింది.

కార్తీకదీపం2 సీరియల్ వల్ల ఇతర ఛానెళ్లలో అదే సమయానికి ప్రసారమవుతున్న సీరియళ్ల రేటింగ్స్ పై మాత్రం నెగిటివ్ ప్రభావం పడుతోంది.కార్తీకదీపం2 సీరియల్ ఆడవాళ్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఓటీటీలో( OTT ) సైతం ఈ సీరియల్ ను చూడటానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు.కార్తీకదీపం2 సీరియల్ ప్రారంభం కావడానికి ముందే ఈ సీరియల్ కు ప్రీమియర్స్ ను ప్రదర్శించడం గమనార్హం.ఇలా ఏ సీరియల్ విషయంలో జరగలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.