నేడు ఏపీలో కేంద్ర ఎన్నికల కమిషన్( Central Election Commission ) పర్యటించనుంది.ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా స్పీడ్ పెంచుతోంది.
అలాగే ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీ వైసీపీతో పాటు , ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేనలు( TDP , Janasenas ) కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏపీలో పర్యటనకు రాబోతూ ఉండడం ఆసక్తికరంగా మారింది.నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన కొనసాగబోతోంది .ఈ పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రికి విజయవాడ కు ఎన్నికల కమిషన్ బృందం చేరుకోనుంది .ఈ పర్యటనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ( Rajeev Kumar )నేతృత్వం వహిస్తున్నారు .
ఆయన నేతృత్వంలోనే ఈ పర్యటన కొనసాగుతోంది .దీనిలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు వివిధ రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల అధికార బృందం సమావేశం కానుంది .ఓటర్ల జాబితాలో అవకతవకులు , పార్టీలు చేసిన ఫిర్యాదులపై రాష్ట్ర సీఈఓ చర్చించనుంది . అనంతరం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు, ఎస్పీలతో సిఇసి సమీక్ష చేయనుంది.ఈనెల 10వ తేదీన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఈనెల 10వ తేదీ సాయంత్రం 4.30 నిమిషాలకు మీడియాతో కమిషనర్లు సమావేశం నిర్వహిస్తారు.ఈ పర్యట నలోనే ఏపీలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లుగా వచ్చిన ఫిర్యాదుల విషయం పైన ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
ఓటర్ల జాబితాలో నిజంగా అవకతవకలు జరిగాయా ? అన్ని పార్టీలు ఫిర్యాదులు చేయడం వెనుక కారణాలు ఏంటి ? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేదానిపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ పర్యటన పై ఆసక్తి తో ఉన్నాయి.