కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి.అమెరికన్ యాక్సెంట్ లో ఆ చిన్నారులు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.
ఆ స్కూలు విద్యార్థులు కొందరు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు.వారు సీఎం ఎదుట ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడారు.
ఎలాంటి తడబాటు లేకుండా సీఎం జగన్ తో ఇంగ్లీషులో మాట్లాడారు.అమ్మఒడి, ఆంగ్ల మాధ్యమంలో బోధన నాడు-నేడు పథకాల విశిష్టతను వారు ఇంగ్లీషులో వివరించారు.ఆ చిన్నారులు ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి జగన్ నవ్వుతూ కనిపించారు.వారి ఆంగ్లభాష ప్రావీణ్యాన్ని వైఎస్ జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు.
అయితే.ఇప్పుడు.
బెండపూడి పక్క గ్రామం రావికంపాడు ప్రభుత్వ హైస్కూల్ ఆయమ్మ కూడా.ఇంగ్లీష్ లోనే మాట్లాడేస్తుంది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.