టీడీపీ అంటే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణపై చర్చ జరుగుతోంది.
ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం వికేంద్రీకరణ జరిగిందన్నారు.
హైదరాబాద్ తరహాలో ఒకే ప్రాంతానికి అభివృద్ధి పరిమితం కాకూడదని తెలిపారు.
రాజధాని ప్రకటనకు ముందే కొందరి చేతుల్లోనే అమరావతి భూములు ఉన్నాయని ఆరోపించారు.
రైతులను బెదిరించి కొందరు భూములు కొనుగోలు చేశారన్నారు.టీడీపీ నేతలు అమరావతిలో భూములు కొన్నది వాస్తవం కదా అని ప్రశ్నించారు.
అనంతరం అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న బుగ్గన.టీడీపీ నేతలకు మాత్రమే ఇక్కడ రాజధాని వస్తుందనే విషయం ఎలా తెలుసని నిలదీశారు.