తెలుగు సినీ ప్రేక్షకులకు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య( Director Sriram Aditya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట భలే మంచి రోజు సినిమాతో( Bhale Manchi Roju ) దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ ఆదిత్య సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.
అయితే మొదటి సినిమా మంచి సక్సెస్ సాధించినప్పటికీ రెండవ సినిమాకు దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య.ఆ తర్వాత శమంతకమణి,దేవదాస్, హీరో లాంటి సినిమాలు చేశారు.
ఇకపోతే ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక షోలో పాల్గొన్న శ్రీరామ్ ఆదిత్య అతని భార్య వారి జీవితంలో జరిగిన మధురమైన జ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.సినిమాలు ట్విస్టులు ఉన్నట్లే మా జీవితంలో కూడా ఎన్నో మలుపులు ఉన్నాయి.మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నేను ఫేస్బుక్ గూగుల్ లో పనిచేస్తున్న సమయంలో కథలు రాసుకున్నాను.ఒకవైపు ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చాను.
అలా నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్ లో ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది.దాంతో ఉద్యోగం మానసి డైరెక్టర్గా ట్రై చేశాను.

ఆ ప్రయత్నంలోనే భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాను అని చెప్పుకొచ్చారు శ్రీరామ ఆదిత్య. సాఫ్ట్వేర్ జాబ్ నుంచి సినీ రంగానికి రావడం దాంతోపాటు నేను ప్రేమించిన అమ్మాయితో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం వంటి కీలక అంశాలు ఎన్నో మలుపులు తిరిగాయి అని చెప్పుకొచ్చారు శ్రీరామ్ ఆదిత్య.ఇకపోతే శ్రీరామ్ ఆదిత్య పెళ్లి వార్త అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

శ్రీరామ్ ఆదిత్య ప్రియాంక ( Priyanka ) అనే అమ్మాయి ప్రేమించగా ఆమె కూడా శ్రీరామ్ ఆదిత్యను ఇష్టపడింది.వాళ్ళిద్దరి పెళ్ళికి ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో పాటు ప్రియాంకకు వేరే పెళ్లి ఫిక్స్ చేసి బంధువులందరికీ పెళ్లి పత్రికలు కూడా ఇచ్చేశారట.కొద్దిరోజుల్లోనే పెళ్లి అనుకుంటున్నా సమయంలో శ్రీరామ ఆదిత్య ఆమె ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.
ఈ దంపతులకు 2020లో ఒక బాబు కూడా పుట్టాడు.