జనసేన దుస్థితికి కారణం వారేనా ?

ఏపీలో జనసేన పార్టీకి , ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

ఇప్పటివరకు ఏ హీరోకి లేనంత స్థాయిలో అభిమానులు పవన్ కి ఉన్నారు.

ఇక పవన్ రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వారంతా పవన్ కి బాసటగా ఉన్నారు.అదీ కాకుండా పవన్ సామజిక వర్గం కూడా ఏపీ లో పెద్ద ఎత్తున ఉండడం వారంతా తమ కులానికి చెందిన వ్యక్తి సీఎం అవ్వాలని, అప్పట్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి సీఎం అవుతారని భావించామని కానీ ఆ ఆశ తీరలేదని, ఇప్పుడు పవన్ ద్వారా ఆ కోరిక తీర్చుకోవాలని కసిగా కనిపించరు.

ఇంకేముంది పవన్ మీద అభిమానం, కుల మద్దతు, అభిమానులు ఇవన్నీ జనసేన పార్టీకి బాగా కలిసొస్తాయని అంతా భావించారు.కానీ పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేసరికి అది కాస్తా వర్కవుట్ అవ్వనట్టే కనిపించింది.

ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతారని భావించిన జనసేన పార్టీ అనూహ్యంగా వెనుకబడిపోయింది.ప్రతి ఒక్కరినీ కలుపుకొని ప్రతి జిల్లాలోనూ బలంగా ఉంటారని భావించినా ఎందుకనో కొన్ని జిల్లాలో అసలు పోటీలో లేకుండా పూర్తిగా వెనుకబడిపోయారు.

Advertisement

ఎన్నికల ముందు సీరియస్ గా ఎలా బలపడాలని పెద్దగా సమీక్షలు చేయని జనసేన ఎన్నికల అనంతరం మాత్రం సమీక్షలు చేస్తూ హడావుడి చేస్తోంది.ముఖ్యంగా పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు సహా కృష్ణా, అనంతపురంలో కూడా ప్రభావం చూపుతుందని అందరూ భావించారు.

అయితే అది కాస్తా రివర్స్ అయినట్టు కనిపించింది.పోలింగ్ సరళి, ఎన్నికల ప్రచారం అనంతరం మాత్రం పార్టీపై ఉన్న అంచనాలు తలకిందులు అయినట్టే కనిపించింది.

దీనినంతటికి జనసేన లో పవన్ కోటరీ నాయకులుగా చెప్పుకోబడుతున్న కొంతమంది వ్యక్తులే కారణమనే చర్చ నడుస్తోంది.వారంతా పవన్ ని భ్రమలోకి తీసుకెళ్లారని, వాస్తవాలు దాచిపెట్టి టీడీపీ, వైసీపీ స్థాయిని మించి జనసేన ప్రభంజనం ఉంది అంటూ పవన్ ని నమ్మించారని, అందుకే పవన్ సరైన స్టెప్స్ తీసుకోవడంలో వెనకబడ్డాడని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ముఖ్యంగా పార్టీ బాధ్యతలు నిర్వమించిన మాదాసు గంగాధరం వంటి నాయకులు మాత్రం ఇంకా వాస్తవాలను మరుగునపరిచి జనసేనకు ఐదు, ఆరు ఎంపీ సీట్లు వస్తాయంటూ పవన్ ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు