సరిగ్గా సంక్రాంతి పండుగ టైంలో వైసీపీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో క్యాసినో నిర్వహించినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం తెలిసిందే.అదే సమయంలో వీడియోలు కూడా బయటకు రావడం మాత్రమే కాక సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
ఈ పరిణామంతో టీడీపీ పార్టీ కీలక నేతలు వరుసబెట్టి మీడియా సమావేశాలు నిర్వహించి వెంటనే మంత్రిగా కొడాలి నానిని తప్పించాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గోవా సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ లో తీసుకు వస్తున్నారని మండి పడ్డారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి ఇటీవల రాజ్యసభలో టిడిపి పార్టీ సభ్యుడు కనకమేడల కూడా మాట్లాడటం జరిగింది.అయితే తాజాగా మరోసారి గుడివాడ క్యాసినో వివాదంపై వర్ల రామయ్య రియాక్ట్ అయ్యారు.” పాశ్చాత్య సంప్రదాయాలను ప్రవేశపెట్టి కేసులు నిర్వహించి రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేయాలని అధికార పార్టీ చూస్తుందని ఆరోపణలు చేశారు.ఈ ఘటనకు సంబంధించి రాజ్యసభలో లేవనెత్తిన కనకమేడల కు అభినందనలు అని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి నిజంగా కాలంగా లో తెలియక.కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా పరిస్థితి మారిందని ఇప్పటికైనా బూతుల మంత్రిని.
మంత్రివర్గం నుండి తప్పించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.