తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న విషయం తెల్సిందే.రాష్ట్రం లో ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ పార్టీ చాలా బలంగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యం లో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ లు తీవ్రంగా ప్రయత్నాలు చేసి కేసీఆర్ ను గద్దె దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ నేపథ్యం లో బీజేపీ ( BJP ) చాలా తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది.
రాష్ట్రంలో బండి సంజయ్( Bandi Sanjay ) బీజేపీ యొక్క పగ్గాలు పట్టిన తర్వాత బలం పుంజుకుంది.అంతే కాకుండా మోడీ మరియు అమిత్ షా లు ప్రత్యేక దృష్టి రాష్ట్రం పై పెట్టడం వల్ల మంచి బలం పుంజుకుంది అనడంలో సందేహం లేదు.

కాంగ్రెస్ కంటే కూడా ఇప్పుడు బీజేపీ బలంగా ఉంది… అధికార బీఆర్‌ఎస్ పార్టీని ఢీ కొట్టగల సమర్థత కేవలం బీజేపీకి మాత్రమే ఉంది అంటూ ఆ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉండగా బీజేపీ నాయకులు కొందరు ఈ మధ్య అసమ్మతి రాగం అందుకుంటున్నారు.అంతర్గత కుమ్ములాట అనేది కాంగ్రెస్ లో కనిపిస్తుంది.కానీ ఈ సారి మాత్రం తెలంగాణ బీజేపీ లో ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు అధికారం మాదే అనుకుంటూ ఉండగా జాతీయ పార్టీ నాయకత్వం చేయబోతున్న పనితో పార్టీ పని ఏమవుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.ప్రస్తుతం బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విషయం తెల్సిందే.ఎన్నికలు వస్తున్న నేపథ్యం లో ఆయన్ను అధ్యక్షుడిగా కొనసాగిస్తే పర్వాలేదు కానీ ఆయన స్థానంలో ఈటెల రాజేందర్( Etela Rajendar ) లేదా డీకే అరుణ ను( DK Aruna ) అధ్యక్ష పదవి లో కూర్చో బెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.అదే జరిగితే పార్టీకి నష్టమా లాభమా అనే చర్చ మొదలు అయ్యింది.
బీజేపీ నాయకత్వం మాత్రం ఇప్పట్లో అధ్యక్షుడి మార్పు లేదు అంటున్నారు.







