బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి హిమజా (Himaja) గురించి పరిచయం అవసరం లేదు.బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించిన ఈమె అనంతరం బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో సందడి చేశారు.
ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉంటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వీడియోలు షేర్ చేస్తూ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటారు.
అదేవిధంగా ఈమె సినిమా అవకాశాలను కూడా అందుకొని సినిమాలలో పలు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇకపోతే హిమజ(Himaja) తన డ్రీమ్ హౌస్ కట్టుకోబోతున్నానంటూ గత కొంతకాలంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఇంటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వచ్చారు.అయితే తాజాగా తన సొంత ఇంటి కల నెరవేరి ఈమె గృహప్రవేశం (House Warming) చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోని గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇందులో ఈమె సాంప్రదాయబద్ధంగా పట్టు పరికిణి ధరించి లక్ష్మీదేవి ఫోటోని చేతిలో పట్టుకొని ఇంట్లోకి అడుగుపెడుతున్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త ఇల్లు నిర్మించుకోవడం అంటే మన కలలను నెరవేర్చుకోవడం జ్ఞాపకాలను పదిల పరుచుకోవడం, నాకు నేనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను అంటూ ఈమె ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది.ఇలా ఈమె గృహప్రవేశం చేశారనే విషయం తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు సన్నిహితులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే ఇదివరకు హోమ్ టూర్ వీడియోలలో ఈమె తన కొత్తగా కట్టబోతున్న ఇంటిని కూడా చూపించిన విషయం మనకు తెలిసిందే.అన్ని సౌకర్యాలతో ఎంతో విలాసవంతంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈమె ఈ ఇంటిని నిర్మించారని తెలుస్తుంది.







