అధిక బరువు ( overweight )సమస్యతో సతమతం అవుతున్న వారి సంఖ్య భారీ స్థాయిలో ఉంది.ఈ సమస్య కారణంగా శరీర ఆకృతి మారడమే కాదు అనేక అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి.
అందుకే బరువు తగ్గడం కోసం చాలా మంది తెగ ప్రయత్నిస్తుంటారు.కఠినమైన డైట్ ను ఫాలో అవ్వడమే కాకుండా.
రోజు చెమటలు చెందేలా వర్కౌట్స్ చేస్తుంటారు.అయితే కొందరికి బిజీ లైఫ్ స్టైల్ కారణంగా వర్కౌట్స్ చేసేంత సమయం ఉండదు.
దాంతో తాము బరువు తగ్గలేమని తెగ ఫీల్ అవుతుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను రోజూ తాగితే వర్కౌట్స్ అక్కర్లేదు.
సూపర్ ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతారు.ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కీరా దోసకాయ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.
అలాగే అర అంగుళం అల్లం ముక్కని ( ginger )తీసుకుని పీల్ తొలగించి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ( Cucumber ) స్లైసెస్, అల్లం, పది ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్,( lemon juice ) పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ) తో పాటు ఒక గ్లాసు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన డ్రింక్ సిద్ధం అవుతుంది.ఈ కీరా పుదీనా డ్రింక్ వెయిట్ లాస్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.రోజు ఈ డ్రింక్ ను తీసుకుంటే ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే కొద్ది రోజుల్లోనే సన్నబడతారు.
క్యాలరీలు చాలా వేగంగా బర్న్ అవుతాయి.

అతి ఆకలి దూరం అవుతుంది.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.వర్కౌట్స్ చేయకపోయినా బరువు తగ్గాలని భావించేవారు తప్పకుండా ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోండి.
పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల చర్మం నిగారింపుగా యవ్వనంగా మెరుస్తుంది.శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి బాడీ డీటాక్స్ అవుతుంది.మరియు నోటి దుర్వాసన సమస్య సైతం దూరం అవుతుంది.