రోజ్ వాటర్ లో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు..

ఇక్కడ అద్భుతమైన చర్మ సంరక్షణ మరియు జుట్టు సంరక్షణ కొరకు రోజ్ వాటర్ యొక్క 10 ప్రయోజనాలు ఉన్నాయి.రోజ్ వాటర్ అనేది ప్రతి భారతీయుని ఇంటిలో తప్పనిసరిగా ఉంటుంది.

 The Amazing Benefits Of Rose Water Details, Rose Water, Rose Water Benefits, Ros-TeluguStop.com

జిడ్డు చర్మం,పొడి చర్మం మరియు కాంబినేషన్ చర్మం ఇలా ఏ చర్మ తత్వానికి అయినా బాగా సెట్ అవుతుంది.భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు ఇది ఒక రహస్య ఆయుధం అని చెప్పవచ్చు.

రోజ్ వాటర్  కొనుగోలు చేసేటప్పుడు, 100 శాతం స్వచ్ఛమైన రోజ్ వాటర్ అని నిర్ధారణ చేసుకొని కొనుగోలు చేయాలి.ఈజిప్ట్ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్లియోపాత్రా ఆమె చర్మ సంరక్షణకు సహజమైన రోజ్ వాటర్ ని ఉపయోగించేది.

10 రోజ్ వాటర్ ప్రయోజనాలు:

1.రోజ్ వాటర్ చర్మం యొక్క pH సంతులనం నిర్వహించడానికి మరియు అధికంగా ఉన్ననూనెను నియంత్రించటానికి సహాయపడుతుంది.

2.రోజ్ వాటర్ లో శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన చర్మ చికాకు, చర్మం మీద ఎరుపుదనం, మోటిమలు,తామర వంటి వాటిని తగ్గించటానికి సహాయపడుతుంది.అలాగే అవరోధం ఏర్పడిన రంధ్రాల ద్వారా పేరుకుపోయిన నూనె మరియు దుమ్ము తొలగించటంలో ఒక గొప్ప ప్రక్షాళనగా పనిచేస్తుంది.

3.చర్మాన్ని హైడ్రేడ్ గా ఉంచటం, రిఫ్రెష్ లుక్ ఇవ్వటం, చర్మాన్ని తేమగా ఉంచటంలో రోజ్ వాటర్ సహాయపడుతుంది.

Telugu Dry Skin, Dandruff, Rose, Rose Benefits, Rose Skin, Skin Care Tips-Telugu

4.రోజ్ వాటర్ లో యాంటి బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన మచ్చలు, కోతలు మరియు గాయాల నయంలో సహాయపడుతుంది.

5.రోజ్ వాటర్ లో యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన చర్మ కణాల బలోపేతం మరియు చర్మ కణజాలం పునరుత్పత్తికి సహాయపడుతుంది.

6.రోజ్ వాటర్ లో ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉండుట వలన చర్మ రంద్రాలను శుభ్రం చేసి చర్మ టోన్ కి సహాయపడుతుంది.రోజ్ వాటర్ ముఖానికి రాసి ఆ తర్వాత ఆవిరి పడితే కేశనాళికలు బిగుతుగా మారటం మరియు ఎరుపుదనం తగ్గుతుంది.

Telugu Dry Skin, Dandruff, Rose, Rose Benefits, Rose Skin, Skin Care Tips-Telugu

7.గులాబీల వాసన ఒక శక్తివంతమైన మానసిక స్థితిని పెంచుతుందని చెప్పుతారు.ఇది ఆందోళన భావాలను తగ్గించి భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.తద్వారా రిలాక్స్ అనుభూతి కలుగుతుంది.

8.రోజ్ వాటర్ కి పోషణ మరియు తేమ లక్షణాలు ఉండుట వలన జుట్టు యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది.

అలాగే తల మీద చర్మ వాపు చికిత్స మరియు చుండ్రు వదిలించుకోవటం కొరకు సహాయపడుతుంది.రోజ్ వాటర్ సహజ కండీషనర్ గా పనిచేసి జుట్టు పెరుగుదలలో అద్భుతాలను చేస్తుంది.

9.రోజ్ సెంట్ మంచి నిద్రకు మరియు రిఫ్రెష్ గా మేల్కొవటానికి సహాయపడుతుంది.

10.చర్మం యవ్వనంగా ఉండేలా, వలయాలు మరియు ముడతలు తగ్గించటానికి సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube