దేవాలయంనకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తే గాని దేవాలయ దర్శనం పూర్తి కాదు.దేవాలయ దర్శనంలో ప్రదక్షిణకు చాలా ప్రాముఖ్యత ఉంది.
సాధారణంగా ప్రతి దేవాలయంలోని నవగ్రహ ఆలయాలు ఉంటాయి.దాంతో చాలా మంది నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కొని ప్రధాన దేవత దర్శనం చేస్తూ ఉంటారు.
ఈ విధంగా చేయటం చాలా తప్పు.నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు.
శనీశ్వరుడుకి తైల అభిషేకం చేసినప్పుడు మరియు నల్ల నువ్వులు దానం చేసినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి.ఎందుకంటే ఆ సమయంలో నల్ల నువ్వులు మన చేతికి గాని శరీరానికి కాని అంటుకోవచ్చు.
అందుకే శని దానాలు చేసినప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవటం కానీ స్నానము చేయటం కానీ చేస్తూ ఉంటారు.కాబట్టి ప్రదక్షిణ చేసిన ఫలితం కలగాలంటే నవగ్రహ ప్రదక్షిణలు చేసినప్పుడు కాళ్ళు కడుక్కోకూడదు.