ముఖ్యంగా చెప్పాలంటే ఆషాడ మాసంలోని( Ashadamasam ) కృష్ణ పక్షం పంచమి తిథి జులై 7వ తేదీన శుక్రవారం రోజు వచ్చింది.ఈ రోజున వారాహి అమ్మ వారికి కొబ్బరితో దీపం( Lamp with coconut ) వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.
అంతే కాకుండా ఈ దీపం వెలిగించిన వారి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరమైపోతాయని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే శుక్రవారం సాయంత్రం సమయంలో వారాహి అమ్మ( Varahi Amma ) వారికి కొబ్బరి దీపాన్ని ఆలయం లో వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
అంతే కాకుండా కుటుంబ సభ్యుల ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి.అలాగే పంచమి తిథి జూలై 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల 17 నిమిషముల వరకు ఉంటుంది.ఆ తర్వాత వెంటనే షష్టి తిథి( Shashti Tithi ) మొదలవుతుంది.ఈ రోజున చంద్రుడు కుంభరాశిలో ఉంటే సూర్యుడు మిధున రాశిలో ఉంటాడు.ఈ రోజున వారాహి దేవిని వజ్ర ఘోషం అని స్మరించుకుంటూ ఉంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి.అలాగే సాయంత్రం సమయం లో అమ్మ వారికి పానకం, నల్ల ద్రాక్ష, అరటి పండ్లు, నల్ల నువ్వులు, ఉండలు, ఉడికించిన చిలకాడ దుంపలను నైవేద్యంగా సమర్పించడం ఎంతో మంచిది.
అంతే కాకుండా చామ దుంపలు కూడా నైవేద్యంగా సమర్పించి వంటకాలలో వాడుకోవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే దుంపలు వారాహి దేవికి ఎంతో ప్రీతికరం అని పండితులు చెబుతున్నారు.ఎందుకంటే అవి భూమి లోపల నుంచి సాగుబడి అవుతాయి కాబట్టి అమ్మవారికి అవి ఎంతో ప్రీతికరం అని చెబుతున్నారు.అలాగే వారాహి దేవి భూమాత,సప్త కన్యల్లో ఒకరు, విష్ణు అంశగా ఆమెను పరిగణిస్తారు.
అందుచేత వరాహి దేవి పూజతో విష్ణు దేవుని అనుగ్రహం కూడా లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.