తమిళ్ స్టార్ హీరో ధనుష్ ( Dhanush )సార్ సినిమా తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెల్సిందే.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో తెలుగు లో ఆయన హీరోగా సినిమా లను నిర్మించేందుకు గాను పలువురు నిర్మాతలు ఇంకా దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్ స్టార్ ధనుష్ హీరోగా తెలుగు లో ఒక సినిమా ప్రారంభం కాబోతుంది.

అయితే గతంలో మొదలు అయిన శేఖర్ కమ్ముల మూవీ( Sekhar Kammula ) అటకెక్కినట్లే అంటున్నారు.కొన్ని చిన్న చిన్న స్క్రిప్ట్ మార్పుల విషయంలో హీరో ధనుష్ ఇంకా దర్శకుడు శేఖర్ కమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ ప్రచారం జరుగుతోంది.అసలు విషయం ఏంటి అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
హీరో గా ధనుష్ తమిళం.హిందీ.
ఇంగ్లీష్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు.కానీ తెలుగు సినిమా విషయం లో మాత్రం స్పష్టత లేదు.
తెలుగు లో సార్ మరో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

శేఖర్ కమ్ముల వంటి విభిన్నమైన చిత్రాల దర్శకుడి తో ధనుష్ సినిమా పడితే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా ( Social media )లో ధనుష్ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు రెండు మూడు ఉన్నాయి.వాటి ల్లో రెండు ఈ ఏడాది లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి ధనుష్ సినీ కెరీర్ విషయంలో క్లారిటీ గా ఉన్నాడు.కానీ తెలుగు సినిమా విషయం లో మాత్రం స్పష్టత కరువు అయ్యింది.
ముందు ముందు అయినా శేఖర్ కమ్ముల సినిమా విషయం లో స్పష్టత ఇస్తాడేమో చూడాలి.ధనుష్ సినిమా లు తెలుగు లో ఇక మీదట మంచి బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







